నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కూతురు గాయత్రి శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. కూతురు గాయత్రికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి వెంటనే తరలించారు.
ఈ క్రమంలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తుండగానే తుది శ్వాస విడిచారు. చిన్న వయసులోనే తమ కళ్ల ముందే కూతురు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడాన్ని చూసిన రాజేంద్ర ప్రసాద్ దంపతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.గాయత్రికి భర్త, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు.

రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రిది ప్రేమ పెళ్లి. ఈ విషయాన్ని రాజేంద్ర ప్రసాదే స్వయంగా ఓ కార్యక్రమంలో తెలిపారు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కుమార్తెతో మాటలు లేవని ఆయన తెలిపారు. ఈ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.












Click it and Unblock the Notifications