మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న రజనీకాంత్, నాగార్జున..!
మల్టీ స్టారర్ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగులో కూడా ఆ హావా ఇప్పడు నడుస్తోంది. ఒకప్పుడు పాత సినిమాల్లో ఎన్‌టీఆర్, ఏఏన్నార్లు కలిసి నటించేవారు. ఇప్పడు జూనియర్ ఎన్‌టిఆర్, రామచరణ్ వంటి పెద్దహీరోలు ఒకే స్ర్కీన్‌పై కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక, తాజాగా, రజనీకాంత్, నాగార్జున ఒకే సినిమాలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ మరోసారి ఒకే స్ర్కీన్ షేర్ చేసుకోబోతున్నారని టాక్ నడుస్తోంది. రజనీ, నాగార్జున కలిసి 32 ఏళ్ల క్రితం ఓ సినిమాలో కనిపించారు. అయితే, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వారిద్దరినీ ఒకే స్ర్కీన్‌పై చూపించిందుకు ఓ యువ దర్శకుడు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
సూపర్ స్టార్ రజనీకాంత్ మల్టీ స్టారర్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటార. ఇటీవలే విడుదలై భారీ హిట్ సంపాదించన 'జైలర్' సినిమాలో కూడా రజనీకాంత్, కన్నడ హీరో శివ రాజ్‌కుమార్, మలయాళ స్టార్ మోహన్ లాల్‌తో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగార్జునతో కలిసి నటించడానికి ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ తన నెక్ట్స్ ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'తలైవార్ 171' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున కూడా కనిపిస్తున్నట్లు తెగ వార్తలొచ్చేస్తున్నాయి. ఈ సినిమాలో కేవలం నాగార్జున మాత్రమే కాదు, చాలామంది స్టార్లు కనిపించనున్నారట.

మొదటిసారి శాంతి క్రాంతి అనే సినిమాలో..
రజనీకాంత్, నాగార్జుల కలిసి 'శాంతి క్రాంతి' అనే సినిమాలో కనిపించారు.ఈ చిత్రం 1991లో విడుదలయ్యింది. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఇప్పడు ఒకే స్క్రీన్‌పై కనిపించనున్నారు. తలైవార్ 171 సినిమా కోసం దర్శకుడు లోకేశ్ నాగార్జునను ప్రత్యేకంగా కలిసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై నాగార్జున ఎలా రియాక్ట్ అయ్యారన్నది తెలియాల్సి ఉంది. నాగార్జున ప్రస్తుతం మరో మల్టిస్టారర్ సినిమాలో నటిస్తున్నారు. 'కుబేర' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు నాగార్జున. ఈ సినిమాలో నాగ్, ధనుష్ తో కలిసి తెరపై కనిపించనున్నారు.












Click it and Unblock the Notifications