రకుల్ ప్రీత్ సింగ్ థైస్ షో.. భర్త షాకింగ్ రియాక్షన్
ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికి తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది. కోలీవుడ్, బాలీవుడ్‌లో కొన్నిసినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. దీంతో రకుల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి.
ఇదే సమయంలో రష్మిక, పూజా హెగ్డె, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేసులో వెనుకపడిపోయింది. ఫొటో షూట్లు, జిమ్ వీడియోలతో గ్లామర్‌గా కనిపించినా కూడా ఫలితం లేకుండా పోయింది. రకుల్ సినిమాల్లో కనిపించి రెండేళ్లు కావొస్తోందంటే ఆమె పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రకుల్ వ్యక్తిగత జీవితానికి వస్తే... జాకీ భగ్నానీ అనే వ్యక్తితో రకుల్ ప్రేమాయణం సాగించింది.

రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు ఈ ఏడాది ఫిబ్రవరి 21 పెళ్లి చేసుకని ఒకటైయ్యారు. రకుల్ చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా చేతిలో లేకపోవడం విశేషం. అయినప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటోంది. జిమ్‌కు వెళ్తోన్న వీడియోలు, లేటెస్ట్ ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తుంటుంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటోషూట్‌ను పోస్ట్ చేసింది.
బ్లాక్ కలర్ సిక్వెన్స్ డ్రెస్సులో ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌తో కూడిన ఫొటొలను నెట్టింట వదిలింది. దేర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ టూ మచ్ బ్లాక్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ ఫొటోల్లో రకుల్ థైస్ షో చేస్తూ, నడుము అందాలతో రెచ్చిపోయింది. ఈ ఫొటొలపై రకుల్ భర్త జాకీ భగ్నానీ స్పందించారు. ఓ మై గాడ్ అని కామెంట్స్ పెట్టాడు. మొత్తానికి ప్రస్తుతం రకుల్ ఫోటోలపై ఆయన భర్త స్పందించడం అనేది హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications