అదిరిపోయే వార్త: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలకగుర్తింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారనుంది. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటు జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టూరిజం , వాణిజ్య రంగాలకు కూడా బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అయితే తాజాగా భోగాపురం విమానాశ్రయానికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి ముఖ్యమైన గుర్తింపు వచ్చింది.

ప్రారంభానికి ముందే భోగాపురం ఎయిర్పోర్ట్ కు ముఖ్యమైన గుర్తింపు

ప్రారంభానికి ముందే ముఖ్యమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇమిగ్రేషన్ , విదేశీయుల చట్టం 2025 పరిధిలో ఈ ఎయిర్ పోర్ట్ ను చేర్చటంతో అది ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ గా అధికారిక గుర్తింపును సొంతం చేసుకుంది. కేంద్ర హోంశాఖ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ సమాచారం వెల్లడయింది. దీంతో భోగాపురం ఎయిర్పోర్ట్ టు కేటగిరి 1 విమానాశ్రయాల జాబితాలో 39వ స్థానంలో చేరింది.

Bhogapuram International Airport enters Category-1 list paving way for international flights

భోగాపురం నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులు సులభంగా నడిచే అవకాశం

ఈ గుర్తింపు కారణంగా భోగాపురం నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులు సులభంగా నడిచే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇమిగ్రేషన్ సౌకర్యాలు కూడా మెరుగుపడతాయి. ఇది ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి దోహదపడటం మాత్రమే కాకుండా, ప్రయాణికుల సంఖ్య పెంచడంతోపాటు ఆర్థిక అభివృద్ధికి, ఉపాధి అవకాశాల మెరుగుదలకు దోహదం చేస్తుంది.

భోగాపురం విమానాశ్రయం వేగంగా నిర్మాణం

ఈ క్రమంలోనే ఈ ఎయిర్పోర్టును ఇమిగ్రేషన్ మరియు విదేశీయుల చట్టం 2025 పరిధిలో చేర్చినట్టు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నితేష్ కుమార్ వ్యాస్ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం భోగాపురం విమానాశ్రయం వేగంగా నిర్మాణం జరుగుతుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్వయంగా భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడంలో చురుకైన పాత్రను పోషిస్తుంది.

ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కీలకంగా భోగాపురం విమానాశ్రయం

ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని, అందుకే దీనిపైన ప్రభుత్వం కీలకంగా దృష్టి సారించింది. కేంద్ర హోంశాఖ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ యత్నాలకు గుర్తింపు అని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఈ అభివృద్ధి దశల వారీగా జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+