నేడు ఈ అద్భుత యోగంతో ఈ రాశులవారికి తిరుగే లేదు!

జులై 14 2026 మంగళవారం నాడు కర్కాటక రాశిలో చంద్రుడు మరియు గురుడు కలిసి ఉండడం వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. అదే సమయంలో సూర్యుడు ప్రభావం వల్ల గురు అస్తంగత్వం కూడా ప్రారంభమవుతుంది. దీంతోపాటు ఈరోజు ఆషాడ అమావాస్య కూడా కావడం విశేషంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో నేడు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం.

మేషరాశి

మేషరాశి జాతకులు నేడు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో నూతన అవకాశాలు రావచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

today rashiphalalu with gajakesari rajyoga these zodiac signs will have good luck and these ones see bad

వృషభ రాశి

గజకేసరి రాజయోగ ప్రభావం వల్ల వృషభ రాశి వారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది అనుకూల సమయం.

మిధున రాశి

నేడు మిధున రాశి జాతకులకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కొంత అయోమయంలో ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. సహోద్యోగులతో వాదనలకు దూరంగా ఉండటం, ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టడం మంచిది.


కర్కాటక రాశి

కర్కాటక రాశి జాతకులకు నేటి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నేడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. చివరి నిమిషంలో కొన్ని పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి.

సింహరాశి

నేడు సింహ రాశి జాతకులకు జాగ్రత్తగా ఉండవలసిన సమయం. అపరిచిత వ్యక్తులతో ఆర్థిక ఒప్పందాలు చేసుకోకుండా ఉంటేనే మంచిది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కెరీర్ పరంగా కూడా సింహ రాశి వారికి మంచి రోజు.

కన్యారాశి

కన్యారాశి జాతకులకు నేడు ఆర్థికంగా లాభదాయకమైన రోజుగా చెప్పవచ్చు. కన్యా రాశి వారి పాత బాకీలు వసూలవుతాయి. స్నేహితుల నుండి సహాయం అందుతుంది. సమాజంలో మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది, కుటుంబ వాతావరణం బాగుంటుంది

తులారాశి

తులా రాశి జాతకులకు నేడు కెరీర్లో మార్పు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులు పై అధికారుల మండలాలు పొందుతారు నేడు ఏ పని చేసిన తులా రాశి వారికి కలిసి వస్తుంది. అయితే ఖర్చులు పెరగకుండా చూసుకోవడం చాలా అవసరం.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి నేడు కొంత మానసిక ఆందోళన ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దైవ చింతన వల్ల మనశ్శాంతి లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి స్పష్టత అవసరం గా కనిపిస్తుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి జాతకులకు నేడు ప్రతికూల ఫలితాలు వస్తాయి ధన నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. పెట్టుబడుల విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఉంటే మంచిది. పనుల్లో కొంత ఆలస్యం ఎదురైనా పట్టుదల వీడకుండా పనిచేయాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

మకర రాశి

మకర రాశి జాతకులకు నేడు వ్యాపార విస్తరణకు సంబంధించి చేసే ఆలోచనలు కలిసి వస్తాయి సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. నూతన పరిచయాలు వ్యాపారస్తులకు మేలు చేస్తాయి.

కుంభరాశి

కుంభ రాశి వారికి కోర్టు వ్యవహారాలు పాత వివాదాలు అనుకూలంగా మారుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. శారీరకంగా శ్రమ అధికంగా ఉంటుంది.

మీన రాశి

మీన రాశి వారు నేడు సృజనాత్మకంగా పనిచేసి ప్రశంసలు పొందుతారు. మీరు చేసే ప్రయాణాలు లాభాలను చేకూరుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంతాన పరంగా శుభవార్తలు వింటారు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+