బాలకృష్ణతో సినిమా చేయలేను - రకుల్ ప్రీత్ సింగ్
ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికి తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయింది. కోలీవుడ్, బాలీవుడ్‌లో కొన్నిసినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. దీంతో రకుల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి.
ఇదే సమయంలో రష్మిక, పూజా హెగ్డె, శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ రేసులో వెనుకపడిపోయింది. ఫొటో షూట్లు, జిమ్ వీడియోలతో గ్లామర్‌గా కనిపించినా కూడా ఫలితం లేకుండా పోయింది. రకుల్ సినిమాల్లో కనిపించి రెండేళ్లు కావొస్తోందంటే ఆమె పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రకుల్ వ్యక్తిగత జీవితానికి వస్తే... జాకీ భగ్నానీ అనే వ్యక్తితో రకుల్ ప్రేమాయణం సాగించింది.

రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు ఈ ఏడాది ఫిబ్రవరి 21 పెళ్లి చేసుకని ఒకటైయ్యారు. రకుల్ చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా చేతిలో లేకపోవడం విశేషం. అయితే గతంలో సీనియర్ హీరో బాలకృష్ణ సినిమాలో చేసే అవకాశం వచ్చిన ఈ భామ రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన హాట్రిక్ మూవీ అఖండ సినిమాలో హీరోయిన్ ఆఫర్‌ను రకుల్ ప్రీత్ సింగ్ రిజెక్ట్ చేసిందట. ఈ సినిమాలో బాలకృష్ణ భార్యగా, ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో ప్రగ్యా జైస్వాల్ నటించింది.
తొలుత ఈ క్యారెక్టర్‌కు రకుల్‌ను అనుకున్నారట దర్శకుడు. కానీ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆమె నో చెప్పిందట. ఆ తర్వాత కాజల్ అగర్వాల్‌ను సంప్రదించగా.. పర్సనల్ రీజన్స్‌తో ఆమె కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. దాంతో బోయపాటి మరో ఆలోచన లేకుండా ప్రగ్యాను ఎంపిక చేశారట. కట్ చేస్తే బాక్సాఫీస్ వద్ద అఖండ బ్లాక్ బ్లాసర్ హిట్‌గా నిలిచింది. రూ. 60 బడ్జెట్‌తో తెరకెక్కిన అఖండ.. ఫుల్ రన్ లో రూ. 150 కోట్ల రేంజ్‌లో కలెక్షన్స్‌ను సొంతం చేసుకుంది. ఆ విధంగా బాలీవుడ్‌లో చేయడం వల్ల బాలకృష్ణతో సినిమా చేయలేనని చెప్పడంతో రకుల్ హిట్ సినిమాను మిస్ చేసుకుంది.












Click it and Unblock the Notifications