బాలీవుడ్ నిర్మాతతో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి...డేట్ కూడా ఫిక్స్..
టాలీవుడ్‌లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో మంచి నటిగా పేరు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతుంది. ఈ బ్యూటీ తెలుగులో రామ్‌చరణ్, ఎన్‌టిఆర్, అల్లుఅర్జున్, గోపిచంద్, వంటి స్టార్‌లందరితోనూ నటించింది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక్కడ మంచి ఆఫర్లు ఉన్న సమయంలోనే బాలీవుడ్‌లో కూడా సినిమాలు తీసింది. అజయ్‌దేవగన్ వంటి బడా స్టార్‌తో నటించింది. కానీ, బాలీవుడ్‌లో రకుల్ చేసిన సినిమాలేమీ విజయాలను అందుకోలేదు.
అయితే, ఈ క్రమంలోనే ఈ అమ్మడు బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాతో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని రకుల్ ప్రీత్ సింగ్ అధికారికంగానే ప్రకటించింది. 2021 నుంచే వీరి మధ్య ప్రేమ నడుస్తోంది. అయితే, అప్పట్లో రకుల్ ప్రేమ పెళ్లిపై నెట్టింట్లో తెగ వార్తలోచ్చాయి. కానీ, అప్పుడే పెళ్లిచేసుకోమని ఒకనోక సందర్భంలో మీడియాకు క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఇప్పుడు తాజాగా వారి పెళ్లి ప్రస్తావన మరోసారి వార్తల్లోకెక్కింది.

గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్న రకుల్..
రకుల్ ప్రీత్ సింగ్ ప్రియుడితో త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు బీ టౌన్ వర్గాల్లో టాక్. ఈ జంట ఫిబ్రవరి 22, 2024ను పెళ్లి చేసుకోబోతున్నట్లు డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసినట్లు, కుటుంబ సభ్యుల మధ్య, అతితక్కువమంది సన్నిహితుల మధ్య వీరి పెళ్లి తంతు జరగబోతున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై రకుల్ నుంచి కానీ, ప్రియుడు జాకీ భగ్నా నుంచి కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. మరి రకుల్ పెళ్లి వార్తా నిజమా? కాదా అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications