రామ్-భాగ్యశ్రీ లవ్ స్టోరీలో ట్విస్ట్..?
సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లపై గాసిప్స్ లేదా రూమర్స్ రావడం ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. ఇద్దరు హీరో హీరోయిన్లు కలిసి ఓ సినిమా తీస్తే చాలు.. ఇక వీరిద్దరి మధ్య ఒక రిలేషన్ ఏదో నడుస్తోందంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. పెళ్లయి ఏడాది కాకుండానే విజయ్ దేవరకొండ రష్మిక మధ్య విడాకులంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. దీంతో స్వయంగా రష్మికనే సోషల్ మీడియా ద్వారా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. తాజాగా టాలీవుడ్లో మరో జంటపై లవ్ రూమర్స్ వచ్చాయి.. ఆ తర్వాత బ్రేకప్ అంటూ ఇదే సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది. తాజాగా ఈ కపుల్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ జంట ఎవరు..? ఏమా కథ..?
టాలీవుడ్లో గాసిప్స్‌కు రూమర్స్‌కు కొదవలేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి స్వేచ్ఛగా డిస్కస్ చేస్తుంటారు. అలాంటి డిస్కషన్స్‌కు మరో జంట బలైంది. ఎనర్టిటిక్ స్టార్ రామ్ పోతినేని - భాగ్యశ్రీ బోర్సేలు తీసిన ఒక్క మూవీతోనే టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు. వారు తీసిన ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం ప్రమోషన్స్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని.. ఇద్దరూ డీప్ లవ్‌లో ఉన్నారంటూ ఆ మధ్య వార్త జోరుగా షికారు చేసింది. వారిద్దరు చాలా సన్నిహితంగా పబ్లిక్‌లో కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇంకా అప్పటికీ వీరు నటించిన సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఇద్దరూ ప్రమోషన్స్ పేరుతో అమెరికాకు వెళ్లడం అక్కడ వారు గడిపిన సమయాన్న, మెమొరబుల్ మోమెంట్స్కు సంబంధించిన వీడియోలను భాగ్యశ్రీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నరంటూ ఇటు ఫ్యాన్స్ అటు సిని విశ్లేషకులు కూడా భావించారు.

ఇక ఆంధ్రాకింగ్ తాలూకా చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎక్కడా కనిపించకపోవడంతో రామ్ భాగ్యశ్రీల మధ్య బ్రేకప్ అయ్యిందంటూ ఇదే సోషల్ మీడియాలో నెటిజెన్లు మరో చర్చకు తెరదీశారు.ఇక రామ్ పోతినేని తన తదుపరి చిత్రంపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా చేస్తూనే తానే సొంతంగా డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్గా చేస్తోంది. ఇదెలా ఉంటే అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడంతో భాగ్యశ్రీకి మరో రెండు సినిమా ఆఫర్లు వచ్చాయి. అందులో తాను బిజీగా ఉంది.
ఇంతవరకు కథ బాగానే ఉంది... తాజాగా రాపో భాగ్యశ్రీలపై మరో వార్త హల్చల్ చేస్తోంది. బ్రేకప్ తర్వాత ఇద్దరూ ప్యాచప్ అయ్యారంటూ ఈ వార్త సోషల్ మీడియాను చుట్టేస్తోంది. రామ్ భాగ్యశ్రీలు సోషల్ మీడియాలో కలిసున్న ఫోటోలు షేర్ చేయడంతో వీరిద్దరూ మళ్లీ ప్రేమలో పడ్డారనే టాక్ నడుస్తోంది. అయితే వచ్చిన ఈ వార్తలపై ఇటు రామ్ గానీ అటు భాగ్యశ్రీ కానీ ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు. అయితే సోషల్ మీడియాలో ఒకే రకమైన ఫోటోలను పోస్టు చేసినంత మాత్రానా ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి ఈ ప్రేమ వ్యవహారం నిజమేనా.. వచ్చిన రూమర్స్‌లో వాస్తవముందా అని ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే ప్రేమలో ఉండి ఆ తర్వాత బ్రేకప్ అయి తిరిగి లవ్‌లో పడినట్లయితే ఈ జంట చూడముచ్చటగా ఉంటుందని కూడా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా సరే ఇద్దరిలో ఒకరైనా అధికారికంగా ధృవీకరిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.














Click it and Unblock the Notifications
