తమన్నాతో బ్రేకప్.. 11 ఏళ్ల చిన్నదైన అమ్మాయితో విజయ్ వర్మ ప్రేమాయణం?

ప్రముఖ నటుడు విజయ్ వర్మ తన నటన, విభిన్న పాత్రలతోనే కాకుండా డేటింగ్ రూమర్లతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఒకప్పుడు నటి తమన్నా భాటియాతో ప్రేమలో ఉన్న విజయ్ వర్మ, ఆ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. తమన్నా నుంచి విడిపోయిన తర్వాత విజయ్ వర్మ జీవితంలోకి మరొకరు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన 'జవాన్' ఫేమ్, సింగర్ ఆలియా ఖురేషీతో ప్రేమలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

తొమ్మిది నెలలుగా నో చెప్తున్న మృణాల్ ఠాకూర్.. అసలు సీక్రెట్ అదేనా?
తొమ్మిది నెలలుగా నో చెప్తున్న మృణాల్ ఠాకూర్.. అసలు సీక్రెట్ అదేనా?

ఆలియాకు విజయ్ వర్మ గ్రాండ్ సపోర్ట్
ఇటీవల ముంబైలో జరిగిన ఆలియా ఖురేషీ ఆల్బబ్ 'ఝల్లి' లాంచ్ ఈవెంట్ లో విజయ్ వర్మ సందడి చేయడంతో వీరిద్దరి డేటింగ్ వార్తలు మరింత బలపడ్డాయి. ఈ ఈవెంట్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆలియా వేదికపై పాడుతున్నప్పుడు విజయ్ వర్మ ఈలలు వేస్తూ, చప్పట్లతో ఆమెను ప్రోత్సహించారు. అంతేకాకుండా ఆమె ప్రదర్శనను తన ఫోన్‌లో రికార్డు చేస్తూ ఆ క్షణాలను ఆస్వాదిస్తున్న దృశ్యాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీరిద్దరి కెమిస్ట్రీని చూసి నెటిజన్లు 'పెళ్లి ఎప్పుడు?' అని.. ఈ జోడి ఎప్పటికీ విడిపోకూడదు అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై విజయ్ కానీ, ఆలియా కానీ ఇప్పటివరకు స్పందించలేదు.

Vijay Varma Dating Alia Qureshi After Tamannaah Bhatia Breakup Age Gap Sparks Buzz Details
Ranabaali Censor Review: విజయ్ దేవరకొండ 'రణబాలి' సెన్సార్ రివ్యూ..
Ranabaali Censor Review: విజయ్ దేవరకొండ 'రణబాలి' సెన్సార్ రివ్యూ..

ఇంతకీ ఆలియా ఖురేషీ ఎవరంటే?
ఆలియా ఖురేషీ నటిగా మారడానికి ముందే సంగీత ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమాతో నటనలోకి అడుగుపెట్టారు. అందులో ఎస్ఎస్పీ ఆజాద్ గ్యాంగ్ లో ఓ సభ్యురాలిగా ఆమె నటించారు. ఆ తర్వాత ఖుషీ కపూర్ నటించిన 'నాదానియాన్'తో పాటు 'బందిష్ బ్యాండిట్స్', 'ఇటర్నల్లీ కన్ఫ్యూజ్డ్ అండ్ ఈగర్ ఫర్ లవ్' వంటి ప్రముఖ ప్రాజెక్టులలో కూడా ఆమె నటించి మెప్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+