'గేమ్ ఛేంజర్' టీజర్..బాక్సాఫీస్ దుమ్ముదులపడం ఖాయం

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న తరుణం రానే వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' టీజర్ కొద్ది నిమిషాల క్రితమే విడుదలైంది. 1:30 సెకన్ల నిడివి గల టీజర్ అభిమానులను ఆకట్టుకుంది. దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. టీజర్‌ను చూస్తుంటే సినిమాలో దర్శకుడు శంకర్ మార్క్ కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని టీజర్ చూస్తుంటే అర్థం అవుతోంది. శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరోగా రామ్ చరణ్ కనిపించబోతున్నారని టీజర్ చూస్తుంటే అర్థం అవుతోంది.

రామ్ చరణ్ మాస్ అవతారంలో ఇరగదీశాడనే చెప్పాలి. సినిమాలో మెయిన్ విలన్‌గా ఎస్‌జె సూర్య కనిపించబోతున్నారు. ఇక తమన్ అందించిన బీజీఎమ్‌ ఆకట్టుకుంది. కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి, సముద్రఖని, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'గేమ్ ఛేంజర్' అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ గత చిత్రం 'ఆచార్య' ఫెయిల్ కావడంతో , 'గేమ్ ఛేంజర్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'గేమ్ ఛేంజర్' సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ లెక్కలన్నీ కూడా మార్చేస్తాడని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.

ram charan game changer teaser released

రామ్ చరణ్ కెరీర్‌లోనే 'గేమ్ ఛేంజర్' భారీ హిట్‌గా నిలపలనే ఉద్దేశంతో దర్శకుడు శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. 'గేమ్‌ ఛేంజర్' సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. 2025 జనవరి 10వ తేదీన 'గేమ్‌ ఛేంజర్' సినిమాను విడుదల చేయబోతున్నారు. మరి విడుదల తర్వాత 'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ లెక్కలను ఎలా మారుస్తాడో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+