దిల్ రాజుతో మరో సినిమా లేదు...రామ్ చరణ్

ఒకే ఒక్క సినిమా దిల్ రాజును ఆకాశం నుంచి పాతాళానికి పడేలా చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, తమిళ స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'గేమ్ ఛేంజర్‌' సినిమాను దిల్ రాజు భారీగా నిర్మించారు. సుమారు రూ.450 కోట్ల రూపాయిలతో భారీ బడ్జెట్‌తో 'గేమ్ ఛేంజర్‌'ను నిర్మించడం జరిగింది. అయితే ఈ సినిమా మొదటి నుంచి కూడా ప్రేక్షకుల్లో అనుకున్నంత బజ్‌ను క్రియేట్ చేయలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది.'గేమ్ ఛేంజర్‌' మూవీ 15 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ. 129.01 వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

దీని ఫలితంగానే "గేమ్ ఛేంజర్" బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవి చూసింది.ఎంత తీసేసిన ఈ సినిమా రూ.250 కోట్లకు పైగానే నష్టాలను మిగిల్చేలా కనిపిస్తోంది. వెంటకేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా లేకపోతే దిల్ రాజు పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. "గేమ్ ఛేంజర్" ఫ్లాప్ కావడంతో దిల్ రాజు తీవ్రంగా నష్టపోయారు.దీంతో దిల్ రాజుతో రామ్ చరణ్ మరో సినిమా చేయనున్నారనే వార్తలు వచ్చాయి. రెమ్యూనరేషన్ తగ్గించుకుని , దిల్ రాజుతో తర్వాత సినిమా చేయడానికి రామ్ చరణ్ రెడీ అయ్యారని ప్రచారం జరిగింది. వాస్తవానికి అలాంటిది ఏమీ లేదని తెలుస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్నారు.

Ram Charan not doing another film with Dil Raju

ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిబ్రవరి నుంచి రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు.ఈ సినిమా పూర్తి అయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్‌తో మరో సినిమా చేయనున్నాడు రామ్ చరణ్.ఇవ్వన్నీ పూర్తి అయితే కానీ, రామ్ చరణ్ తర్వాత సినిమా ఏంటనేది ఆలోచించరు. దీంతో దిల్ రాజుతో రామ్ చరణ్‌ సినిమా ఇప్పట్లో లేనట్టే అని అభిప్రాయం వ్యక్తం అవుతంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+