స్కంద మూవీ స్టోరీ: రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు
ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగు సినిమా ప్రేమికులు ఎప్పుడెప్పుడా? అని ఉత్కంఠగా ఎదురుచూసిన స్కంద సినిమా విడుదలైంది. అంతేకాదు టాలీవుడ్ దద్దరిల్లిపోయేలా ఓపెనింగ్స్ రాబడుతోంది. రామ్ పోతినేని సినీ కెరీర్ లో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా స్కంద నిలిచింది. బోయపాటి సృష్టించిన మాస్ జాతర పాన్ ఇండియా జాతరలా మారిపోయింది. అభిమానుల కోలాహలంతో థియేటర్ల వద్ద కూడా జాతర జాతరలా ఉంది.
సినిమా బాగా వచ్చిందని చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. రామ్ ఎంట్రీ అయితే ఒక రేంజ్ లో ఉందంటున్నారు. ప్రధానంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కథతో ప్రారంభం కావడం కొత్తగా ఉందని, అలాగే శ్రీకాంత్ పోషించిన పాత్ర ఒకప్పటి సాఫ్ట్ వేర్ దిగ్గజం సత్యం రామలింగరాజును పోలివుందంటున్నారు. రాహుల్, నవీన్, రామకృష్ణంరాజు పాత్రులు కూడా నిజ జీవితంలోని వ్యక్తులను పోలివున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల కుటుంబ గొడవలతో సినిమా ప్రారంభమవుతుంది. ఏపీ ముఖ్యమంత్రి కూతుర్ని తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకు వచ్చి ఎత్తుకెళతాడు. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య వైరం మొదలవుతుంది. ఆంధ్రా సీఎం ఓ యువకుడిని రంగంలోకి దింపుతాడు. అతను అలాంటి ఇలాంటి వ్యక్తి కాదు. ఎవరినైనా ఎదురించి అనుకున్నది సాధించే రకం. కట్టుదిట్టమైన భద్రతను కాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఇంట్లోకి అడుగుపెట్టడంతోపాటు ఇద్దరు ముఖ్యమంత్రుల కూతుళ్లను కిడ్నాప్ చేసి రుద్రరాజపురం తీసుకువెళతాడు. అతను ఎందుకు తీసుకువెళ్లాడు? ఈ కిడ్నాప్స్ కు రామకృష్ణంరాజు (శ్రీకాంత్) మధ్య సంబంధం ఏంటి? అనే విషయాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.












Click it and Unblock the Notifications