గంటకు లక్షన్నర టికెట్లు ఖతం.. ఉద్యమంలా తరలివస్తున్న ప్రేక్షకులు..!
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూసిన 'రామాయణ' మూవీ దీపావళి కానుకగా నవంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచే ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. నార్త్ సౌత్ అని తేడా లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అటు ఓవర్సీస్ లోనూ రామాయణ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దంగల్ ఫేమ్ నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ దృశ్య కావ్యాన్ని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. దాంతో థియేటర్ల వద్ద టికెట్ ముక్క దొరకని పరిస్థితి నెలకొంది. ఫస్ట్ రోజును మించిన వసూల్లు మూడో రోజు వసూలు కాగా ఇవాళ సోమవారం అయినా టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ అయిన బుక్ మై షో లో గంటకు లక్షా 39 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ రేంజ్ లో టికెట్స్ బుకింగ్ కావడం ఇదే తొలిసారి. గతంలో ఏ సినిమాకూ ఇంతలా టికెట్స్ బుకింగ్ కాలేదని స్పష్టం అవుతోంది.
ఈ మేరకు రామాయణ మూవీ బుకింగ్స్ విషయంలో సంచలన రికార్డును నమోదు చేసింది. గతంలో ధురంధర్ 2 మూవీ గంటకు లక్షా 9 వేల టికెట్స్ బుకింగ్ తో ఇప్పటివరకూ టాప్ లో ఉంది. రెండో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప-2 సినిమా గంటకు లక్షా 7 వేల టికెట్స్ తో ఉంది. అయితే వీటిని ఈజీగా దాటేసిన రామాయణ మూవీ ఇప్పుడు గంటకు ఏకంగా లక్షా 39 వేల టికెట్స్ బుకింగ్ తో ఎవరూ టచ్ చేయలేని విధంగా అరుదైన రికార్డును నెలకొల్పింది. ఒక్క బుక్ మై షో యాప్ లోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ పరిస్థితి ఏంటోనని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక సినిమా ప్రేక్షకులు దర్శకుడు నితీష్ తివారీ 3 గంటల పాటు త్రేతాయుగంలోకి తీసుకెళ్లారని అద్భుతమైన విజువల్స్, నటీనటుల పాత్రలు, పోరాట ఘట్టాల గురించి మాట్లాడుకుంటున్నారు.

ఇక రామాయణ మూవీకి ఐదు రోజుల్లోనే దాదాపు రూ. 500 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. రానున్న రోజుల్లో కలెక్షన్స్ భారీగా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ తో పాటు ఇంటర్నేషనల్ స్థాయిలో కొత్త చరిత్రను సృష్టించే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ రాముడిగా నటించారు. అలాగే సాయిపల్లవి సీత పాత్రలో నటించారు. ఇక రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా మెప్పించారు. అలాగే బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ హనుమంతుడిగా.. రవి దూబె లక్ష్మణుడిగా నటించారు. ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా, యష్ సంయుక్తంగా నిర్మించారు. దీపావళి కానుకగా ఈ మూవీ పార్ట్ 1 రిలీజైంది. పార్ట్ 2 వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
