Ranabaali First Review: విజయ్ దేవరకొండ 'రణబాలి' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక చిత్రం 'రణబాలి'.. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజ్ అయిన రణబాలి ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ మూవీని టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించారు. విజయ్ దేవరకొండ- రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో గతంలో వచ్చిన టాక్సీవాలా మూవీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ కానున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా నెలకున్నాయి. అలాగే రణబాలి మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్- రష్మిక వివాహం తర్వాత వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇక రణబాలి ఒక పీరియాడికల్‌ హిస్టరీ మూవీ. 1870 దశకంలో బ్రిటిష్ పాలనలో ఉన్న రాయలసీమ నేపథ్యంలో రణబాలి కథ సాగుతుంది. 1876-78 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతంలో వచ్చిన కరవు నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన కంటెంట్ ను చూస్తే అర్థం అవుతుంది. ఆ సమయంలో రాయలసీమలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఓ వీరుడి కథే రణబాలి. ఈ మూవీలో విజయ్ సింగనమల బొబ్బిలి రణబాలి అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో బ్రిటిష్ అధికారి సర్ థియోడర్ హెక్టర్ క్యారెక్టర్ ​లో 'ది మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లో యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి అజయ్- అతుల్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు.

రణబాలి చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా నీరవ్ షా తన పనితనాన్ని చూపించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్​ పై వై. రవిశంకర్, నవీన్ యెర్నేని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఇక రణబాలి మూవీకి సంబంధించిన ఫస్ట్ రీవ్యూ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ రివ్యూ ప్రకారం.. రాహుల్ సాంకృత్యాన్ ఈ మూవీని సాధారణ కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా వాస్తవికతకు దగ్గరగా ఆనాటి పరిస్థితులు, బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

Ranabaali first review prestigious film starring Tollywood s Rowdy Boy Vijay Deverakonda is out

అలాగే విజయ్- రష్మిక పాత్రల మధ్య ప్రేమ, రొమాంటిక్ సన్నివేశాలు కథలో భావోద్వేగాలకు బలంగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. అలాగే సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ.. బ్రిటిష్‌ పాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు, యాక్షన్‌ సీక్వెన్స్ లు మతిపోయేలా ఉంటాయని తెలుస్తోంది. ఇక క్లైమాక్స్ లో విజయ్- ఓస్లో మధ్య వచ్చే పతాక సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని సమాచారం అందుతోంది. ఇక రణబాలి మూవీకి సంబంధించిన ఫుల్ రివ్యూ కోసం మరికొద్ది గంటలు ఆగాల్సిందే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+