గంటకు 60 వేల టికెట్లు తెగుతున్నాయ్.. 75 ఏళ్ల వయసులో రజనీకాంత్ విధ్వంసం..
సూపర్ స్టార్ రజనీకాంత్ ఐదు దశాబ్దాలకు పైగా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. తన స్టైల్, స్వాగ్, స్క్రీన్ ప్రజెన్స్ తో జెన్ జీ కిడ్స్ ను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. ఎలాంటి పెద్ద పెద్ద యాక్షన్ ఫైట్స్, డాన్స్ సీక్వెన్స్ లు లేకుండానే ఆయన కేవలం నడిచొస్తే చాలు రికార్డులు బద్దలు అవుతున్నాయి. 2023 లో జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన ఇప్పుడు దానికి సీక్వెల్ గా జైలర్ 2 తో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ 15 న విడుదలైన జైలర్ 2 మూవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. జైలర్ తో పోల్చుకుంటే సినిమా ఆ రేంజ్ లో లేదని టాక్ వస్తున్నా.. దర్శకుడు నెల్స్ తన మార్క్ ఫన్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్ లు, ఎలివేషన్ షాట్స్ తో జైలర్ 2 చిత్రాన్ని ఎక్కడా బోర్ కొట్టకుండా తీసినట్లు రివ్యూలు వస్తున్నాయి.
ఇక ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షో యాప్ లో రజనీకాంత్ మూవీ విధ్వంసం సృష్టిస్తోంది. స్టార్ హీరో సినిమా అంటే ఏంటో నిరూపిస్తోంది. గంటక దాదాపు 60 వేల టికెట్స్ బుకింగ్ అవుతున్నాయి. కేవలం బుక్ మై షో యాప్ లోనే ఈ ఫిగర్ ఉంటే ఇక డిస్ట్రిక్ట్ తో పాటు ఇతర యాప్స్ లో అలాగే డైరెక్ట్ గా థియేటర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేసే వారి సంఖ్యను కూడా యాడ్ చేసుకుంటే జైలర్ 2 మూవీ థియేటర్లలో మాస్ జాతర చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
సినిమాకు హిట్ టాక్ రావడంతో తలైవా ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ రజనీకాంత్ మాస్ ర్యాంపేజ్ ఇప్పట్లో ఆగేలా లేదు. పండగ ముగిసేంత వరకూ ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో జైలర్ 2 మూవీకి టికెట్ ముక్క దొరకడం లేదు. రిలీజ్ కు ముందే రెండు రోజులకు సరిపడా హౌజ్ ఫుల్స్ అయ్యాయి. ఈ క్రమంలో తమిళనాడు రజనీకాంత్ స్టామినా ఏంటో మరోసారి క్లియర్ గా కనిపిస్తోంది. 75 ఏళ్ల వయసులో సూపర్ స్టార్ ర్యాంపేజ్ అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

మరోవైపు జైలర్ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ పై సెలబ్రిటీలు రజనీకాంత్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. జైలర్ 2 సినిమా బ్లాక్ బస్టర్ అని వెల్లడించారు. ప్రతి తలైవా ఫ్యాన్ చూడాల్సిన సినిమా అంటూ ఆకాశానికి ఎత్తారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇక జైలర్ 2 చిత్రానికి నెలన్స్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.












Click it and Unblock the Notifications
