Video: హర్మూజ్ జలసంధిలో కుప్పలుగా తేలియాడుతున్న ఐఫోన్లు.. వీడియో వైరల్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అలాగే ఉన్నాయి. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిలో కుప్పలు తెప్పలుగా ఐఫోన్లు, పెర్ఫ్యూమ్ బాటిల్స్ తేలియాడుతున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రూ. కోట్లు విలువ చేసే ఇన్ని వేల ఐఫోన్లు ఇలా నీటిలో తేలియాడుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
JUST IN: Iran has Sunk a Container Ship in the Strait of Hormuz that was carrying luxury Perfumes and Iphones from Dubai toNigeria.Person millions 😩😪😢💔 https://t.co/otzv6heRyD
— Mr Chizzy (@MrChizzyMe) October 15, 2026
అయితే సింగపూర్ జెండా కలిగి కంటైనర్ జీఎఫ్ఎస్ ప్రైడ్.. హార్మూజ్ జలసంధి గుండా ఐఫోన్లు , ఇతర కార్గో సామాగ్రిని దుబాయ్ నుంచి తరలిస్తున్న క్రమంలో ఓ సీమైన్ ను ఢీకొట్టి నౌక మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇరాన్ కు చెందిన భద్రతా దళం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ధృవీకరించింది. హార్మూజ్ లోని ప్రమాదకరమైన మార్గంలో ఈ పడవ ప్రయాణం చేసిన క్రమంలో ఘటన జరిగిందని పేర్కొంది. అయితే మేరిటైమ్ సెక్యూరిటీ అధికారుల ప్రకటన మాత్రం భిన్నంగా ఉంది. సింగపూర్ జెండా కలిగిన రెండు వాణిజ్య నౌకలు హార్మూజ్ గుండా ప్రయాణిస్తున్న క్రమంలో గుర్తు తెలియని క్షిపణి ఢీ కొంది. ఈ ఘటనలో ఓ నౌక మునిగిపోయింది. మరో నౌక సురక్షితంగా గమ్యాన్ని చేరుకుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో మొదటి నౌకలోని సిబ్బందిని సురక్షితంగా రక్షించామని స్పష్టం చేశారు. దాంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో ప్రకారం ప్రమాద సమయంలో ఈ వాణిజ్య నౌకలో 2,500 కంటైనర్లు ఉన్నాయని అవన్నీ ప్రస్తుతం నీటిలో మునిగినట్లు తెలుస్తోంది. ఇక పడవ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు చిన్న చిన్న బోట్లతో ఘటనాస్థలికి చేరుకుని నీటిలో తేలియాడుతున్న విలువైన వస్తువుల్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రతరం అవుతున్నాయి. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు ఆగడం లేదు. గత 10 రోజుల్లోనే దాదాపు ఐదు నౌకలు ఈ దాడులతో దెబ్బతిన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ సరఫరాకు హార్మూజ్ జలసంధి ప్రధాన రవాణా మార్గం కావడంతో ఇలాంటి ఘటనలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
