మూలా నక్షత్ర వేళ ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు కీలక సూచనలు..!!

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత పవిత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. మూలా నక్షత్రం రోజున సామాన్య భక్తులకే ప్రథమ ప్రాధాన్యమివ్వాలని దేవస్థానం నిర్ణయించింది. అమ్మ వారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమివ్వనుండటంతో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దర్శనాల పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం కు ప్రత్యేకత ఉంది. ఈ రోజున భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మ వారి దర్శనానికి తరలి రానున్నారు. దీంతో.. భక్తులకు సులభంగా, త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అన్ని క్యూలైన్లను పూర్తిగా ఉచిత దర్శన మార్గాలుగా నిర్వహించనున్నారు. ప్రోటోకాల్‌, సిఫార్సు దర్శనాలతో పాటు అన్ని రకాల అంతరాలయ దర్శనాలను రద్దు చేశారు.
కాగా.. మూలా నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సాధారణ భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలు, ప్రోటోకాల్, సిఫార్సు దర్శనాలు పూర్తిగా రద్దు చేశారు. భక్తులందరికీ ముఖమండపం నుంచే శ్రీ సరస్వతీ దేవి అలంకార దర్శనం కల్పించనున్నారు. అలాగే ​రేపు కొండపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎటువంటి ప్రైవేటు వాహనాలను అనుమతించకూడదని ఆలయ అధికారులు నిర్ణయించారు.

 తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్- ఇలా చేయండి..!!
తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్- ఇలా చేయండి..!!
indrakeeladri-temple-prioritises-common-devotees-on-moola-nakshatram-here-the-details

ఆలయ అధికారుల నిర్ణయాలు

అదే విధంగా సర్వీస్ పాసులతో సహా ఇప్పటికే జారీ చేసిన అన్ని రకాల వాహన పాసులను తాత్కాలికంగా హోల్డ్‌లో ఉంచనున్నారు. అత్యవసర అధికారిక రవాణాకు మాత్రమే అనుమతి ఇవ్వాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. కాగా.. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటం బహూకరణ చేసారు. శ్రీకాకుళం కు చెందిన భక్తులు 494 గ్రాముల బంగారు కిరీటాన్ని సమర్పించారు. కూర్మినాయుడు, పద్మావతమ్మ దంపతుల కుమారుడు కె. దుర్గా శ్రీనివాస్‌ స్వర్ణ కానుక అందించారు. ఎరుపు, నీలం, తెలుపు, పచ్చ రాళ్లతో నవరత్న ఖచిత కిరీటం రూపకల్పన చేసారు. ఆలయ ఈవో వీకే శీనా నాయక్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వి. త్రినాథరావుకు కిరీటం అందజేసారు. దాత కుటుంబానికి అమ్మవారి అంతరాలయంలో ప్రత్యేక దర్శనం కల్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+