S. S. Rajamouli: 'వారణాసి' తర్వాత రాజమౌళి ఎవరూ ఊహించని నిర్ణయం..?

సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'.. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనుల్లో బిజీగా ఉంది. వారణాసి మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో మహేష్ బాబు రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో మెరవనుండగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మందాకిని అనే పాత్రలో నటిస్తోంది. ఇక మలయాళీ స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ కుంభ అనే శక్తివంతమైన విలన్ పాత్రలో నటిస్తున్నారు. అదే విధంగా సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ సైతం ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దుర్గాఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత కే. ఎల్. నారాయణ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

వారణాసి మూవీకి సంబంధించిన ప్రొమోషన్స్ రానున్న రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 9 మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా చిత్రంలో ఆయన పోషించిన రుద్ర పాత్రను పరిచయం చేస్తూ రాజమౌళి ప్రత్యేకంగా పోస్టర్‌ ను పంచుకున్నారు. ఆ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఒత్తయిన జుట్టు, గడ్డం, మీసాలతో రగ్గడ్‌ లుక్‌ లో మహేష్ ఆకట్టుకుంటున్నారు. సాహసికుడి పాత్రకు తగ్గట్టుగా ఆయన గెటప్‌ ను తీర్చిదిద్దినట్లు ఫస్ట్‌ లుక్‌ ను చూస్తే అర్థమవుతోంది. ఇక భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దాదాపు 120 కు పైగా దేశాల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

Rajamouli making a live-animation film after the movie Varanasi featuring Superstar Mahesh Babu

అయితే ఇప్పుడు అందరికీ ఒకటే ప్రశ్న వస్తుంది.. వారణాసి మూవీ తర్వాత రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి..? అని ఈ సినిమాపై ఇప్పటి వరకూ రకరకాల వదంతులు వచ్చాయి. బాహుబలి 3 ఉంటుందని.. ఆర్ఆర్ఆర్ 2 ఉంటుందని.. అలాగే ఎన్టీఆర్ తో ఓ సినిమా ఉంటుందని, కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఓ సినిమా ఉంటుందని.. ఇలా రకరకాల ఊహాగానాలు బయటకు వచ్చాయి. కానీ అవేవీ అధికారికంగా ధృవీకరించబడలేదు. అయితే వారణాసి మూవీ తర్వాత రాజమౌళి ఊహించని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఓ లైవ్ యాక్షన్ యానిమేషన్ చిత్రాన్ని తీసే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు స్పష్టం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+