రష్మిక అరుదైన సంచలన రికార్డ్
రష్మిక మందన్న కన్నడం నుంచి తెలుగుకు, ఆ తర్వాత తమిళం, తాజాగా బాలీవుడ్ బాట పట్టింది. ఈ అమ్మడు నేషనల్ క్రష్‌గా అందరికీ సుపరిచితమైన సంగతి తెలిసిందే. పుష్ప సినిమా ఘనవిజయంతో పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటింది. ఈ ఏడాది సంక్రాంతికి వారసుడు సినిమాతో పలకరించింది. తాజాగా రణ్‌బీర్ కపూర్‌తో చేసిన యానిమల్‌తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఈమె ఖాతాలో మరో సంచలన రికార్డు నమోదైంది.
ప్రస్తుతం రష్మిక మందన్న.. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ అనే తేడా లేకుండా అన్ని సినీ పరిశ్రమల్లో తన సత్తా చూపిస్తూనే ఉంది. ఇప్పటికే హిందీలో టాప్ టక్కర్ ఆల్బమ్‌తో ఫేమస్ అయిన రష్మిక.. ఆ తర్వాత 'గుడ్ బై', 'మిషన్ మజ్ను' సినిమాలు చేసింది. తాజాగా ఈమె తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్‌లో ఎలాంటి మొహమాటం లేకుండా నటించి తన గట్స్ ఏంటో చూపించింది.

ప్రముఖ సోషల్ మీడియాలో ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు 40 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. దక్షిణాది హీరోయిన్స్‌లో ఇది ఒక రికార్డు అని చెప్పాలి. ఇంతవరకు ఎవరూ ఈ మార్క్ ను టచ్ చేయలేకపోయారు. ఒక మనిషి.. క్రూరుడిగా ఎందుకు మారాడనే కాన్సెప్ట్‌తో యానిమల్ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. అర్జున్ రెడ్డి హ్యాంగోవర్‌తో అదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్'గా తెరకెక్కించి హిట్ అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి. యానిమల్ మూవీతో దర్శకుడిగా మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. బాలీవుడ్‌లో పాగా వేయాలనుకుంటున్న రష్మికకు కూడా ఈ సినిమా విజయం మంచి జోష్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications