Ravi Teja: మహేష్ బాబు, అల్లు అర్జున్ కు పోటీగా రవి తేజ.. ఏకంగా ఆరు స్క్రీన్స్..
మాస్ మహారాజా రవి తేజ గురించి చెప్పాల్సిన పని లేదు. అతను చిన్న స్థాయి నుంచి హీరో ఎదిగాడు. సైడ్ యాక్టర్ గా ప్రస్థానం మొదలు పెట్టిన రవితేజ అంచలంచలుగా ఎదిగారు. టాలీవుడ్ లోనే ప్రముఖ హీరోల్లో ఒకడిగా నిలిచాడు. రవి తేజ సినిమాల్లోనే కాదు.. బిజినెస్ లో కూడా తన ప్రతిభను చూపేందుకు సిద్ధమయ్యాడు. తోటి హీరోలకు పోటీగా బిస్ నెస్ ప్రారంభించనున్నాడు. ఇప్పటికే కొందరు హీరోలు బిజినెస్ లో రాణిస్తున్నారు.
మూవీలో వచ్చిన డబ్బుతో వ్యాపారాలు చేస్తున్నారు. థియేటర్లు, మల్టీప్లెక్స్ లు ప్రారంభిస్తున్నారు. లాభాలు ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే ఏఎంబీ పేరు మల్టీప్లెక్స్ లు నిర్మించారు. ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్ లు బిజీగా ఉన్నాయి. ఇక మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి వచ్చారు. ఏఏఏ పేరుతో మల్టీప్లెక్స్ కొనసాగిస్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా ఏవీడీ థియేటర్ కొనసాగిస్తున్నారు.

విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ క్రియేట్ చేసి దుస్తువులు సేల్స్ చేస్తున్నారు. ఏషియన్ సంస్థ కలిసి మహేష్, బన్నీ, విజయ్ దేవరకొండ వ్యాపారం చేస్తున్నారు. కింగ్ నాగార్జున కూడా వ్యాపారాలు ఉన్నాయి. కొందరికి రెస్టారెంట్ బిజినెస్ లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మాస్ మహారాజా కూడా వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నాడు. అది కూడా థియేటర్ల బిజినెస్. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో ఓ మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
ఈ మల్టీప్లెక్స్ కు ఏఆర్ టీ సినిమాస్ అనే పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రవితేజ, ఏషియన్ పేర్లు కలిసి వచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏషియన్ సంస్థతో కలిసి రవితేజ నిర్మిస్తున్నా ఈ మల్టీప్లెక్స్ థియేటర్ మొత్తం ఆరు స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications