అల్లు అర్జున్ పవన్‌ మధ్య విభేదాలకు కారణం అతడే..? బయటకొచ్చిన అసలు నిజం

మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలవడమే దీనికి కారణం. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.

దీని తర్వాత అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, దానికి బన్ని అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వడం చక చక జరిగిపోయాయి. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేశారు. ఇక ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం..అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు.

reason for the differences between Allu Arjun and Pawan kalyan

కిర్రాక్ ఆర్పీ వంటి ఆర్టిస్టులు నేరుగానే అల్లు అర్జున్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు సైతం గట్టిగానే కౌంటరిస్తున్నారు. అసలు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరం ఎప్పుడు పెరిగిందా అనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓ నిర్మాతకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పవన్‌ను అల్లు అర్జున్ కోరడం.. దీన్ని పవన్ రిజెక్ట్ చేశారట. అప్పటి నుంచే వీరి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది.

నిర్మాత బన్నీ వాసు అల్లు ఫ్యామిలీకి అతి దగ్గరైన వ్యక్తి. బన్నీ వాసుకు టికెట్ ఇవ్వమని అల్లు అరవింద్, అల్లు అర్జున్ చాలా సార్లు పవన్ కళ్యాణ్‌ను రిక్వెస్ట్ చేశారట. అయితే పవన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. గతంలో జనసేనకు మద్దతుగా నిలిచిన బన్నీ వాసు ఎన్నికల సమయంలో ఎక్కడ కనిపించలేదు. దీంతో బన్నీ వాసు కారణంగానే అల్లు , మెగా ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయని అందరూ భావిస్తున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+