నటి కస్తూరికి రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన ఎగ్మూరు కోర్టు
నటి కస్తూరి శంకర్‌కు ఊరట లభించింది. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, ఇటీవలే హైదరాబాద్‌లోఅరెస్టై, చెన్నై జైల్లో ఉన్న నటి కస్తూరికి ఊరట లభించింది. ఎగ్మూర్ కోర్టు కస్తూరికి బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన తర్వాత ఆదివారం ఆమెను ఎగ్మూర్ కోర్టులో హాజరు పరచి, 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. నవంబర్ 29 వరకూ రిమాండ్ ఇచ్చారు. దీంతో పోలీసులు కస్తూరిని చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు.
అయితే, కస్తూరి కోర్టును బెయిల్ కోరింది. తాను ఒంటరి తల్లని, తనకు స్పెషల్ చైల్డ్ ఉందని, ఆ పాప బాగోగులు చూసుకోవాలని కోర్టుకు విన్నవిస్తూ బెయిల్ కోరింది. దీంతో ఎగ్మూర్ కోర్టు కస్తూరికి పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల (నవంబర్) 3వ తేదిన చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన నటి కస్తూరి శంకర్ తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. కస్తూరి చేసిన వ్యాఖ్యలకు తెలుగు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. చెన్నైలో ఆమెపై పలు కేసులు పెట్టడంతో పోలీసులు ఆమెను పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఈ నెల 29న అరెస్ట్ చేశారు.

తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు...
కోర్టు కస్తూరికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పుళల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కస్తూరికి బెయిల్ మంజూరు కావడంతో ఆమె విడుదల కానున్నారు. తమిళనాడులో ఇటీవలే తమిళ బ్రహ్మణ సమ్మేళనం నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన కస్తూరి తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 300 ఏళ్ల కిందట రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వాళ్లని అంటూ తమిళనాడులోని తెలుగువారిపై అనుచితంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు కాస్త తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఎగ్మూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదయ్యింది. అయితే, తాను తెలుగువారిని తక్కువచేసిన మాట్లాడలేదని, ఈ వ్యాఖ్యలపై కస్తూరి వివరణ ఇచ్చి, క్షమాపణలు కూడా చెప్పారు. అనంతరం పోలీసులు కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications