డబ్బులు సాయం చేయండి ప్లీజ్..పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో తెలుగు మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే రేణు దేశాయ్ ఇప్పుడు తరచూ కనిపిస్తూ సందడి చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.
రేణు దేశాయ్ చాలాకాలం తరువాత తెలుగు సినిమాలో నటించింది. రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ ఓ ముఖ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. అయితే రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. రూ.3500 డొనేట్ చేయమని రేణు దేశాయ్ పోస్ట్ చేసింది. దీంతో కొందరు డొనేట్ చేయగా.. ఇంకొందరు ఆమె అకౌంట్ హ్యాక్ అయిందని కామెంట్లు పెట్టారు.

తాజాగా.. ఈ విషయంపై స్పందించిన రేణుదేశాయ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ''కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాలేదు. అందుకే వీడియోలు చేయలేదు. అయితే రూ. 3500 కోసం రిక్వెస్ట్ పెట్టింది నేనే. నేను కూడా రెగ్యులర్‌గా డబ్బులు డొనేట్ చేస్తుంటాను. కానీ నా కూడా లిమిట్ ఉంటుంది.నా దగ్గర కూడా కొంత డబ్బు మాత్రమే ఉంది. నాకు నా పిల్లలకు కూడా కావాలి కదా అందుకే నా వరకు సాయం చేసాక.. ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఫాలోవర్స్‌ను అడుగుతున్నాను.
ఈ మధ్య కాలంలో డొనేషన్లు ఎక్కువగా చేస్తున్నాను. ముఖ్యంగా యానిమల్స్, చిన్నపిల్లల ఫుడ్ కోసం డొనేట్ చేస్తున్నా. నేను డొనేట్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే మీకు అడుగుతాను. త్వరలోనే షెల్టర్ కూడా కడతాను. అప్పుడు అధికారికంగా డొనేషన్ అడుగుతాను. మీ సపోర్ట్ కు థ్యాంక్యూ. రేపు ఫుడ్ ప్యాకెట్స్ అండ్ డొనేషన్ కు సంబంధించిన పిక్స్ మీతో షేర్ చేసుకుంటాను" అని వీడియోలో తెలిపింది రేణు దేశాయ్. దీంతో ఆమె దాతృత్వం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications