రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్..ఆ పార్టీకి మద్దతుగా చేతిపై టాటూ
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల కాలంలో తెలుగు మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే రేణు దేశాయ్ ఇప్పుడు తరచూ కనిపిస్తూ సందడి చేస్తున్నారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్, ఆ తరువాత కాస్ట్యూమ్ డిజైనర్‌గా కొన్ని సినిమాలకు పని చేసింది. రేణు దేశాయ్ వర్కింగ్ స్టైల్ నచ్చడంతో దర్శకుడు పూరీ జగన్నాథ్ తన తొలి సినిమాలో హీరోయిన్‌గా ఆఫర్ ఇచ్చారు.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో రేణు దేశాయ్ హీరోయిన్‌గా పరిచియం అయింది. పవన్ కల్యాణ్‌తో కలిసి రేణు దేశాయ్ రెండు సినిమాల్లో నటించారు. బద్రి, జానీ సినిమాల్లో పవన్‌కు జోడి రేణు దేశాయ్ కనిపించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమ సహజీవనంగా మారి ఆ తరువాత పెళ్లి వరకు దారి తీసింది. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు.

ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది. రేణు దేశాయ్ చాలాకాలం తరువాత తెలుగు సినిమాలో నటించింది. రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది. రవితేజ హీరోగా తాజాగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ ఓ ముఖ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. రేణు దేశాయ్ తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అదేంటంటే.. రేణు తన చేతి మీద ఉన్న టాటూను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కొన్నిసార్లు పదాల కంటే చిత్రాలు బిగ్గరగా మాట్లాడతాయంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ రాసుకొచ్చింది. దీనికి 'ఎలక్షన్ 2024' అనే హ్యాష్ టాగ్‌ను జతచేసింది. రేణు దేశాయ్ తన చేతిపై బీజేపీ గుర్తును టాటూగా వేయించుకోవడంతో ఆమె ఆ పార్టీకి మద్దతుగా ఈ పోస్ట్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇప్పుడు రేణు దేశాయ్ పోస్ట్ నెట్టంట హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications