సనాతన ధర్మంపై క్లాస్ పీకిన రేణు దేశాయ్

రేణు దేశాయ్ గురించి కొత్తగా పరిచియం చేయాల్సిన పనిలేదు. బద్రి సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన రేణు దేశాయ్ ఆ తర్వాత పవన్ కల్యాణ్‌తో ప్రేమలో పడ్డారు. పవన్ కల్యాణ్‌తో కలిసి రేణు దేశాయ్‌ రెండు సినిమాల్లో నటించారు. బద్రి, జానీ సినిమాల్లో పవన్‌కు జోడి రేణు దేశాయ్‌ కనిపించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమ సహజీవనంగా మారి ఆ తరువాత పెళ్లి వరకు దారి తీసింది. పవన్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే రేణు దేశాయ్‌ ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత రష్యా అమ్మాయి అన్నా లెజినోవాతో పవన్ కల్యాణ్ ప్రేమలో పడ్డారు. ఆమెతో సహజీవనం చేస్తూనే ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యారు.

ఇక పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు.ఇదే సమయంలో తనని ట్రోల్ చేసి వారికి సైతం ఆమె తనదైనరీతిలో సమాధానం ఇస్తున్నారు. ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్‌ ఎప్పటికప్పుడు తనదైనశైలిలో స్పందిస్తుంటారు. జంతువులను హింసిస్తే రేణు దేశాయ్ వేగంగా స్పందిస్తుంటారు. ఇక రేణు దేశాయ్ పలు ఎన్జీవోలను నడుపుతున్నారు. తద్వారా జంతువులతో పాటు, అనాథ ఆశ్రమాలకు సైతం ఆమె సాయం చేస్తుంటారు.

Renu Desai made comments about Sanatana Dharma

ఇదిలా ఉంటే సనాతన ధర్మం గురించి రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేణు దేశాయ్ తల్లి ఇటీవలే మరణించారు. అయితే దీనికి చాలామంది Rip అని పెట్టి తన తల్లి మరణానానికి నివాళులు అర్పించారని,వాస్తవానికి అలా చేయకూడదని రేణు దేశాయ్ తెలిపారు. దానికి బదులు ఓం శాంతి, సద్గతి అని చెబితే బాగుంటుందని సూచించింది. సనాతన ధర్మం కూడా అదే చెబుతోందని రేణూ దేశాయ్ పేర్కొంది. ఈ విష‌యాన్ని తాను కొన్ని ర‌కాల ఆచారాల గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడే ఒక పండిట్ నుండి రిప్..సద్గ‌తి మ‌ధ్య తేడా తెలుసుకున్నాన‌న్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+