పవన్ కల్యాణ్‌తో రేణు దేశాయ్ భేటీ...?
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె పవన్‌తో విడాకులు తీసుకుని చాలాకాలం అయినప్పటికి తెలుగు ఇండస్ట్రీలో ఆమెకంటూ ప్రత్యక స్థానం ఉంది. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వా రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది. రేణు దేశాయ్ చాలాకాలం తరువాత తెలుగు సినిమాలో నటించింది. రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది.
రవితేజ హీరోగా తాజాగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ ఓ ముఖ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ఆ మధ్య రెండో పెళ్లి చేసుకోవాలని ప్రకటించినప్పటికి, పవన్ అభిమానుల విమర్శలకు ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంది. ఈ సమయంలో ఆమె పవన్ కల్యాణ్ నుంచి తీవ్ర ట్రోలింగ్‌కు కూడా ఎదురైంది. పవన్ అభిమానులకు ఆమె అదే రీతిలో కౌంటరిచ్చేవారు. ఇదిలా ఉంటే రేణు దేశాయ్ తన మాజీ భర్త పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారని తెలుస్తోంది.

భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్‌కు చీఫ్ అడ్వైజర్‌గా రేణు దేశాయ్ కొనసాగుతున్నారు. ఈక్రమంలోనే రేణు దేశాయ్ తెలంగాణ అటవీ, పర్యావరణ , దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖతో భేటీ అయ్యారు.ఈ క్రమంలోనే వచ్చే వారం ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసే అవకాశమున్నట్లు సమాచారం.ఆనంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కూడా ఆమె భేటీ కానున్నారనే వార్త వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో పిల్లలకు ఆధ్యాత్మికత చాలా అవసరమని, దీని గురించి వివరించి యూనివర్సిటీ ఏర్పాటుకు మంత్రులతో రేణు దేశాయ్ చర్చించనున్నారు. విడాకులు తర్వాత తొలిసారి ఇలా అఫీషియల్‌గా పవన్‌ను రేణుదేశాయ్ కలుస్తున్నారని తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications