ఆంధ్రా వ్యాపారవేత్తతో దిల్ రాజు వియ్యం?
తెలుగు సినీ పరిశ్రమలో పెళ్లి భాజాలకు సమయం వచ్చినట్లుంది. మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ఇటలీలో పెళ్లి చేసుకోనుండగా, మరో వైపు హీరో వెంకటేష్ రెండో కుమార్తె వివాహం కూడా జరగనుంది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ ఫ్యామిలీతో తాజాగా నిశ్చితార్థం జరిగింది. మరోవైపు సంగీత దర్శకుడు కీరవాణి రెండో తనయుడు శ్రీసింహ, మురళీమోహన్ మనవరాలితో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈకోవలోనే తెలుగు చిత్రీసీమకు చెందిన మరో ప్రముఖ వ్యక్తి ఇంట్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఆయనెవరో కాదు.. దిల్ రాజు. ఈ అగ్ర నిర్మాత సోదరుడు శిరీష్ కుమారుడైన ఆశిష్ రెడ్డి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారవేత్తతో వియ్యం అందుకోబోతున్నారు. డిసెంబరు నెలలో నిశ్చితార్థం జరగనుంది. పెళ్లిని ఫిబ్రవరిలో చేస్తున్నారు. వివాహాన్ని రాజస్తాన్ రాజధాని జైపూర్ లో ఘనంగా నిర్వహించాలనుకుంటున్నారు. వాస్తవానికి ఆశిష్ వివాహం గురించి కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు కలిసి మాట్లాడుకున్నారు. దిల్ రాజు తరఫున దర్శకుడు సుకుమార్ సైతం పెళ్లి పెద్దగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

సినీ నిర్మాణ వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరిస్తూ వచ్చిన ఆశిష్ రెడ్డి గత ఏడాది విడుదలైన రౌడీ బాయ్స్ చిత్రంతో హీరోగా మారారు. శ్రీహర్ష దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా సుకుమార్ శిష్యుడు విశాల్ కాశీ దర్శకత్వంలో సెల్ఫిష్ అనే సినిమా చేస్తున్నారు. తమ హోం బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కూడా భాగస్వామిగా వ్యవహరిస్తోంది.












Click it and Unblock the Notifications