షూటింగ్ నుంచి అలిగి వెళ్లిపోయిన బాలయ్య..?
నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే ఆ సినిమా హిట్ అనే ఫిక్స్ అయిపోతారు సినీ అభిమానులు. బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లకు ప్రసిద్ధి చెందింది. వారి సినిమాలు పవర్ఫుల్ డైలాగులు, యాక్షన్ సీక్వెన్సులు ,బలమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు మూడు బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించారు.
బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా సింహా.ఈ సినిమా బాలకృష్ణ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మలుపు. అప్పటి వరకు వరుస ఫ్లాప్‌లతో సతమతం అవుతున్న బాలకృష్ణకు ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా లెజెండ్ (2014). ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంది. బాలకృష్ణకు మాస్ ఇమేజ్‌ను మరింతగా పెంచింది. ఇందులో జగపతి బాబు విలన్‌గా నటించారు.వీరిద్దరు కలిసి చేసిన మూడో సినిమా అఖండ (2021).ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.

బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇందులో బాలకృష్ణ అఘోర పాత్రలో కనిపించి మెప్పించారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఆఖండ 2 (వర్కింగ్ టైటిల్: ఆఖండ 2: తాండవం) అనే చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా 2021లో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా వస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2025 దసరా సందర్భంగా విడుదల కానుంది. అయితే ఆఖండ 2 సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది.దర్శకుడు బోయపాటికి బాలకృష్ణల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆఖండ 2 అనుకున్నట్టు రాకపోవడంతో , సినిమా షూటింగ్ నుంచి బాలకష్ణ వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు. ఆఖండ 2 గురించి వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు. సినిమా షూటింగ్ సజావుగా జరుగుతుందని నిర్మాతలు ప్రకటించారు. దీంతో ఈ సినిమా గురించి వస్తోన్న రూమర్స్‌లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ఇక ఈసినిమాను 14 రీల్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications