2025లో బెస్ట్ సినిమా ఇదే.. ఎవరూ ఊహించని విధంగా అవార్డు
తెలుగు సినిమా వేదికపై ప్రయోగాత్మక చిత్రాలకు పట్టం కట్టే సమయం ఇది. దాసరి ఫిలిం అవార్డ్స్ 2025 వేడుకలో సంచలనం సృష్టించింది 'శబరి' చిత్రం. వరలక్ష్మి శరత్ కుమార్ తనదైన శైలిలో ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రేక్షకులను కట్టిపడేసే కథాంశంతో ఉత్తమ కథా చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది.
అమెరికాలో స్థిరపడిన నిర్మాత మహేంద్ర నాథ్ ఈ చిత్రాన్ని నిర్మించగా, విడుదలైన నాటి నుండి 'శబరి' తన విభిన్నమైన కథతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన దాసరి ఫిలిం అవార్డుల్లో ఉత్తమ కథా చిత్రంగా నిలవడం ఈ సినిమా విజయానికి మరింత బలం చేకూర్చింది. కథకు ప్రాధాన్యమిచ్చే చిత్రాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ అవార్డును ఏర్పాటు చేయడం జరిగింది.

దివంగత దర్శకులు దాసరి నారాయణ రావు గారి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఈసారి 'శబరి' ఉత్తమ కథా చిత్రంగా నిలవడం నిజంగా అభినందించదగ్గ విషయం. వరలక్ష్మి నటన, కథలోని మలుపులు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయని ఈ అవార్డు నిరూపిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన కథా చిత్రాలు రావడానికి 'శబరి' విజయం స్ఫూర్తినిస్తుందని చిత్ర యూనిట్ తెలిపారు.












Click it and Unblock the Notifications