అతనితో ప్రత్యేక బంధం ..సాయి పల్లవి పోస్ట్ వైరల్
హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రేమమ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తన నటనతో అభిమానులను సాయి పల్లవి ఫిదా చేసిందనే చెప్పాలి. ఇక సాయి పల్లవి స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తన తొలి తెలుగు సినిమా ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాటపర్వం వరకు అన్ని విభిన్నిమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తుంది. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

తాజాగా సాయి పల్లవికి ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. గార్గి సినిమాలో సాయి పల్లవి నటనగానూ ఈ అవార్డు ఆమెకు దక్కింది. ఇదిలా ఉంటే సాయి పల్లవి సాధారణంగా సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటోంది. ఎప్పుడో ఒకసారి మాత్రం తన వ్యక్తిగత విషయాలను పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా అలాంటి పోస్ట్ ఒకటి షేర్ చేసింది. తాజాగా సాయి పల్లవి తన తండ్రి సెంతామరై పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో ఉన్న ఫోటోలు షేర్ చేసింది.
వాటిలో భాగంగా 60వ పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్న. మాకు ప్రశాంతమైన జీవితం ఇచ్చినందుకు థాంక్యూ. మీ జీన్స్ నుంచి ఫుట్ బాల్ ఆడటానికి బలమైన కాళ్లు, మైగ్రేన్ ఇచ్చినందుకు థాంక్యూ. చాలా సెన్సిటివ్‌గా ఉండే మమ్మల్ని స్ట్రాంగ్‌గా మార్చినందుకు.. నాకు, పూజాకు స్ఫూర్తిని ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. వాళ్ళ నాన్న పాత ఫొటోలతో పాటు తనని ఎత్తుకున్న ఫోటో కూడా షేర్ చేసింది. ఇక సాయి పల్లవి కెరీర్ విషయానికి వస్తే..నాగ చైతన్యతో 'తండేల్' మూవీలో నటిస్తోంది. బాలీవుడ్‌లో 'రామాయణం' సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది.దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications