సీత పాత్రలో సాయిపల్లవి...అభిమానులను మెప్పించేనా...
గత కొన్ని సంవత్సరాలుగా, రామాయణం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎక్కువగా మాట్లాడే ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారిపోయింది. ఇప్పటికే బాలీవుడ్‌లో ఆదిపురుష్ సినిమాతో ఈ ఏడాది ఒక రామాయణం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా పెద్దగా ఆశించిన ఫలితాలను అందించలేదు. దీంతో మరో రామాయణాన్ని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట బాలీవుడ్ మేకర్స్. ఇక ఈ రామయణంలో రాముడి పాత్రలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ నటించగా, సీతపాత్రలో సాయిపల్లవి నటిస్తున్నట్లు బీటౌన్ వర్గాల్లో వినిపిస్తుంది. సహజంగా నటించి ఏ పాత్రకైనా మంచి విలువను తీసుకొస్తుంది సాయిపల్లవి అని నమ్మి బాలీవుడ్ సీత పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం. మొదటి నుంచి పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకున్నారు నటి సాయిపల్లవి. ఆ విధంగానే సీత పాత్రకు ఒకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి డైరెక్ట్ చేస్తున్నారు.
రావణాసురుడి పాత్రలో యష్ : అయితే, ఇందులో అసలు సిసలైన పాత్ర రావణాసురిడిది. ఈ పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. రావణాసుడి పాత్రలో కెజిఎఫ్ నటుడు యష్ కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం యష్ ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఆదిపురుష్ సినిమాలో రావణాసురిడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ఆలీఖాన్ నటించారు. అయితే ఆ పాత్ర పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదని టాక్ వచ్చింది. ఇప్పడు రావణాసురిడి గెటప్‌లో యష్ ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.. ఈ ప్రాజెక్ట్ గతకొంతకాలంగా సన్నాహక దశలో ఉంది. ఎట్టకేలకు మేకర్స్ ఈ ఇతిహాసాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. 2024 మొదటి త్రైమాసికంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ తారాగణంతో రామాయణం సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

2024 ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం : ఈ రామాయణాన్ని రూపొందించడంలో నితేష్ తివారీ బృందం చురుకుగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన బ్లూప్రింట్ సిద్ధంగా ఉంది. VFX ప్లేట్‌లను ఆస్కార్ విన్నింగ్ కంపెనీ, DNEG సిద్ధం చేసింది.ఈ రామాయణంలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తుండగా, సాయి పల్లవి సీత మాతగా కనిపించనుంది. మరోవైపు యష్ పది తలల రావణుడి పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ బహుళ-స్థాయి పాత్రను పోషించేందుకు నటుడు చాలా ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి 2024 ఫిబ్రవరి నెలలో సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తారు. మొదటి భాగం రాముడు, సీతపై ఎక్కువ దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఫిబ్రవరి నుండి ఆగస్టు 2024 వరకు చిత్రీకరణలో పాల్గొంటారు. దీనిని రామాయణం పార్ట్‌వన్‌గా పిలుస్తున్నారు.

జులై నుంచి యష్ షూటింగ్ : ఈ చిత్రంలో రావణుడి పాత్రలో నటిస్తోన్న యష్ జూలైలో తన షూటింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. రామాయణంలో యష్ చాలా వైవిధ్యభరితమైన పాత్రని చేయబోతున్నాడు. మొదటి భాగం కోసం 15 రోజులు షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రెండవ భాగం శ్రీలంకలో షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఈ ముగ్గురు ప్రధాన లీడ్‌లు తమ లుక్ టెస్ట్‌లను ఇప్పటికే పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications