రూట్ మార్చిన స్టార్ హీరో కొడుకు.. హీరో టూ విలన్ !
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోగా దూసుకుపోయిన సైఫ్.. ప్రస్తుతం ముఖ్య పాత్రలతో సరిపెట్టుకుంటున్నారు. ఇక హీరోగా నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండడంతో విలన్ పాత్రల్లో సైతం మెప్పించారు. అజయ్ దేవగణ్ హీరోగా చేసిన "తానాజీ" లో తనదైన నటనతో మెప్పించి అలరించారు.
హిందీలోనే కాకుండా తెలుగులో ప్రభాస్ "ఆదిపురుష్", జూనియర్ ఎన్టీఆర్ "దేవర"లో నెగిటివ్ రోల్స్ పోషించారు. అయితే ఇటీవల సైఫ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆయన సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చారు. ఇంటి దగ్గరే ఉంటూ స్క్రిప్ట్ సెలక్షన్ లో బిజీగా ఉంటున్నారని.. మళ్లీ హీరో క్యారెక్టర్లపై ఫోకస్ పెట్టారని అంటున్నారు. అయితే తండ్రి బాటలోనే ఆయన వారసుడిగా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు ఇబ్రహీం అలీఖాన్.

ఇబ్రహీం..
సైఫ్ అలీఖాన్, అతడి మాజీ భార్య అమృతా సింగ్ తనయుడే ఇబ్రహీం. మొదటి భార్యకు విడాకులిచ్చిన అనంతరం సైఫ్.. హీరోయిన్ కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి తైమూర్, జెహంగీర్ అని ఇద్దరు కుమారులు సంతానం. కాగా ఇబ్రహీం, ఖుషీ కపూర్ జంటగా తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా "నాదానియా" ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యింది. కానీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. ఇబ్రహీం నటన కూడా సోసో మార్కులే పడ్డాయి.
ఈ క్రమంలోనే ఇబ్రహీం అలీఖాన్ రూట్ మార్చినట్టు తెలుస్తోంది. పృధ్వీరాజ్ సుకుమారన్, కాజోల్ జంటగా నటిస్తోన్న చిత్రం "సర్ జమీన్". ఇటీవలే ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. బోమన్ ఇరానీ కుమారుడు కయోజ్ ఇరానీ ఈ సినిమాకు దర్శకుడుగా చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఇబ్రహీం అలీఖాన్ టెర్రరిస్టు పాత్రలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. హీరోగా కేవలం ఒక సినిమాలోనే నటించి రెండో చిత్రంలో నెగిటివ్ పాత్ర చేయడం ఏంటని జోరుగా చర్చ నడుస్తోంది.
కెరీర్ స్టార్టింగ్‌లో నెగిటివ్ రోల్స్ తీసుకుని ఇమ్రాన్ రిస్క్ చేస్తున్నాడా అని భావిస్తున్నారు. అయితే ఈ మూవీ థియేటర్లలో కాకుండా ఓటీటీలోకి రాబోతుంది. జియో హాట్ స్టార్‌లో జులై 25 నుండి డిజిటల్ స్క్రీనింగ్ కానుంది. చూడాలి మరి ఈ సినిమాలో ఇబ్రహీం ఏ మేరకు మెప్పిస్తాడో అని.












Click it and Unblock the Notifications