ప్రభాస్ 'కల్కి 2' లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. ఆ రోజే సెట్స్ లోకి ఎంట్రీ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో మనకు తెలిసిందే. 2024 లో వచ్చిన ఈ భారీ పౌరాణిక సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే కల్కి 2898 ఏడీ భారీ విజయం తర్వాత ప్రేక్షకులంతా 'కల్కి 2- ది సినిమాటిక్ యూనివర్స్' కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సీక్వెల్ పై రోజురోజుకూ క్రేజ్​ పెరిగిపోతుంది. ఇక కల్కి 2 మూవీ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఇతర కమిట్‌మెంట్స్ కారణంగా ఈ మూవీ షూటింగ్ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త అప్‌ డేట్లు, కాస్టింగ్ వివరాలు ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారినట్లు స్పష్టం అవుతోంది.

కల్కి 2 మూవీలో దీపికా స్థానంలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సాయి పల్లవిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమె త్వరలోనే సెట్స్ లోకి జాయిన్ కానున్నట్టు సమాచారం అందుతోంది. ఈ అక్టోబర్ లోనే సాయి పల్లవి జాయిన్ కావాల్సి ఉండగా ఈ ప్లాన్ లో ఇపుడు ఛేంజ్ వచ్చినట్టు సమాచారం. సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ రామాయణ మూవీ ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో.. ఆ సినిమా విడుదల తర్వాత కల్కి 2 సెట్స్ లోకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. అంటే రానున్న నవంబర్ లోనే ఆమె సెట్స్ లో అడుగు పెట్టనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఆమె ఎంట్రీ దాదాపు ఖరారైనట్లేనని ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

SaiPallavi replaces Deepika Padukone in Prabhas Kalki 2 set to join the shoot on that very day

ఇక కల్కి 2 మూవీ షూటింగ్ పై ఇటీవల దర్శకుడు నాగ్ అశ్విన్ కీలక అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్టోబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. చిత్రంలోని నటీనటులందరి కాల్ షీట్స్ రెడీగా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది ప్రారంభంలోనే కమల్​ హాసన్, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్​ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. ఇక కల్కి 2 షూటింగ్ అక్టోబర్​ లో మొదలు పెట్టి వచ్చే ఏడాది ప్రథమార్ధం నాటికి కంప్లీట్ చేస్తామని నాగ్ అశ్విన్ స్పష్టతనిచ్చారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి కల్కి 2 ను భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+