పవన్ కల్యాణ్‌కు సలార్ బ్యూటీ మద్దతు
ఏపీలో ఎన్నికలకు కేవలం రెండు రోజులు సమయం మాత్రమే ఉంది. దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా తమ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశాయి. మరోసారి నవరత్నాలే అమలు చేస్తామని వైసీపీ అధినేత జగన్ చెప్పగా, సూపర్ సిక్స్ పేరుతో ప్రజల ముందుకొచ్చారు కూటమి నేతలు. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 2019 ఎన్నికల్లో భీమవరంతో పాటు గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయారాయన.
Wishing you great luck #Pawanakalyan garu for a successful election in pithapuram ! May you be blessed with abundance always . #VoteForGlass pic.twitter.com/5scPQrThuT
— Sriya Reddy (@sriyareddy) May 10, 2024
ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ఉద్దేశంతో ఆయన కాపులు అధిక సంఖ్యలో ఉండే పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈక్రమంలోనే పిఠాపురంలో టీడీపీ నేతలతో కలిసి విసృతంగా ప్రచారం నిర్వహించారాయన. పవన్ కల్యాణ్ గెలుపు కోసం జబర్థస్త్ నటులు సైతం రంగంలోకి దిగారు. మెగా హీరో వరుణ్ తేజ్, నాగబాబు ఆయన భార్య ప్రచారం నిర్వహిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సైతం పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.

తాజాగా సలార్ బ్యూటీ శ్రియా రెడ్డి కూడా పవన్‌కు మద్దతు తెలిపారు. ఇకపోతే తాజాగా సలార్ బ్యూటీ శ్రియా రెడ్డి కూడా పవన్ కళ్యాణ్‌కు ధైర్యంగా ముందుకు వచ్చి మద్దతు తెలిపింది.పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నది జరగాలని, ఆయనకు విజయం దక్కాలి అంటూ ట్వీట్ వేసింది. శ్రియా రెడ్డి ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. గాజు గ్లాసుకు ఓటు వేయండి అని వేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications