నా ప్రేమ అంతా నీతోనే.. హీరోపై సమంత షాకింగ్ పోస్ట్
హీరోయిన్ సమంత ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది. ఆ తరువాత తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత సినిమాలు చేయడం తగ్గించింది. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' తరువాత ఆమె మళ్లీ వెండితెర మీద కనిపించింది లేదు.ఇటీవలే తిరిగి సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది సమంత. తాజాగా సిరీస్‌కు సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ టైటిల్‌ను ''హనీ, బన్నీ'' పెట్టినట్టు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సమంత చేసిన ఓ మెసేజ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీకి మారింది.
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో సమంత ఇటీవల కాలంలో చాలా క్లోజ్‌గా ఉన్నట్టు కనిపిస్తోంది. సమంత నటిస్తోన్న ''హనీ, బన్నీ'' వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్‌నే హీరోగా నటిస్తున్నాడు. దీంతో వరుణ్ ధావన్‌కు సమంత క్లోజ్ ఫ్రెండ్‌గా అయిపోయింది. వరుణ్ ధావన్ చేసిన ప్రతి పోస్ట్‌కు సమంత రియాక్ట్ అవుతోంది. దీంతో వీరి మధ్య బాండ్ స్ట్రాంగ్ అయినట్లు కనిపిస్తుంది.
బుధవారం వరుణ్ ధావన్ పుట్టిన రోజు కావడంతో అతనికి తన సోషల్ మీడియా ద్వారా విషెష్ తెలిపింది. వరుణ్ ధావన్‌తో కలిసి ఫుడ్ తింటున్న ఫోటోను షేర్ చేస్తూ... ' సెండింగ్ యూ లాట్స్ ఆఫ్ లవ్ మై డియర్ ఫ్రెండ్. ఈ ఏడాది నీకు ఇంకా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా ' అని తెలిపింది. దీనికి సబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications