అల్లు అర్జున్, రామ్ చరణ్ సరసన ఛాన్స్ కొట్టేసిన సమంత
హీరోయిన్ సమంత ప్రస్తుతం కథలను వింటోంది. మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకోవడం కోసం ఏడాదికి పైగా సినిమాలకు విరామం ప్రకటించింది. ఈ సమయంలో చికిత్సతోపాటు దేశ, విదేశాలను చుట్టివచ్చింది. నిన్న తన పుట్టినరోజు సందర్భంగా లేడీ ఓరియంటెడ్ కథతో రాబోతున్నట్లు ప్రకటించింది. తన సొంత బ్యానర్ పైనే దీన్ని నిర్మిస్తున్నారు. సినిమాలకు ఏడాది విరామం రావడంతో ఆ స్థానాన్ని ఇతర హీరోయిన్లు తన్నుకుపోయారు. దీంతో తాను ఎంత తప్పు చేశాననే విషయం సామ్ కు బాగా అర్థమైంది. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తోంది.
ఈ క్రమంలోనే ఈ అమ్మడుకు రెండు బంపర్ ఆఫర్లు తగిలినట్లు తెలుస్తోంది. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించబోతున్న చిత్రంలో సమంత హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీని తర్వాత మరో ఆఫర్ ను అమ్మడు పట్టేసింది. రామ్ చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఇందులో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేశారు. సమంతకు దర్శకుడు సుకుమార్ గతంలో మాటిచ్చినట్లుగా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు.

వరుసపెట్టి రెండు పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో హీరోయిన్ గా ఎంపికవడంపై సామ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఉన్నా? ఏం చేస్తున్నా? తన పని పట్ల అత్యంత నిబద్ధత, అంకిత భావం కనపరిచే వ్యక్తి సమంత అని నెటిజన్లు కొనియాడుతున్నారు. రామ్ చరణ్ - సమంత కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోసారి వీరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందనే ఆశాభావాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. వరసపెట్టి సినిమాలు చేసుకుంటూ రాబోతున్న సమంత బిజీబిజీగా ఉండబోతోందంటున్నారు.












Click it and Unblock the Notifications