నాగ చైతన్య నటించిన ఆ సినిమా కోసం నేను ఎందుకు వస్తాను ..సమంత సంచలన కామెంట్స్
నాగ చైతన్య, సమంతల బంధం గురించి తెలిసిన విషయమే. నాగ చైతన్య , సమంత కాంబినేషన్‌లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఏమాయ చేశావే, మనం, ఆటో నగర్ సూర్య, మజిలి వంటి సినిమాలు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఏమాయ చేశావే సినిమాతోనే సమంత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చించిందనే విషయం తెలిసిందే. 'ఏ మాయ చేశావే' సినిమాతో కలిసి నటించిన వీరు ప్రేమలో పడి, 2017లో ఘనంగా వివాహం చేసుకున్నారు. వారి అభిమానులు వారిని 'చైసామ్' అని ముద్దుగా పిలుచుకునేవారు.
అంతా సవ్యంగానే ఉంది అనుకుంటున్న తరుణంలో, 2021లో అనూహ్యంగా వారిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులను షాక్‌కు గురి చేశారు.విడాకుల తర్వాత ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాలు, కెరీర్‌పై దృష్టి సారించారు. నాగ చైతన్య ఇటీవల నటి శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నారు. సమంత కూడా తన కెరీర్‌పై పూర్తిగా దృష్టి సారించి, పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి, అయితే దీనిపై ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు.

తాజాగా, 'ఏ మాయ చేశావే' సినిమా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 18, 2025న రీ-రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో, సినిమా ప్రమోషన్ల కోసం నాగచైతన్య, సమంత కలిసి వస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే దీనిపై కూడా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై స్పందించారు. ఏ మాయ చేసావే ప్రమోషన్స్ విషయంలో కూడా అందరికీ క్లారిటీ ఇచ్చారు సమంత. మూవీ టీమ్‌కు సంబంధించిన ఎవరితో కూడా తాను ప్రమోట్ చేయడం లేదని సమంత తెలిపారు.
ఆ సినిమాకు పని చేసిన వారితో కలిసి ప్రమోషన్స్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారని, వారి ఆలోచనలో ఎలాంటి తప్పులేదని సమంత చెప్పుకొచ్చారు. కానీ ప్రేక్షకుల దృష్టి కోణంపై ఒకరి జీవితం ఆధారపడి ఉండదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా సమంత తన తొలి సినిమాకు సంబంధించిన తొలి షాట్‌ను గుర్తు చేసుకున్నారు.జెస్సీ, కార్తీక్ పై షూట్ చేసిన ఇంటి గేటు సీన్ తన తొలి షాట్ అని సమంత వెల్లడించారు.గౌతమ్ మీనన్ వంటి డైరెక్టర్‌తో పని చేయడం అదృష్టమని సమంత పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications