తొలి ముద్దు మర్చిపోలేకపోతున్న సమంత..15 ఏళ్లు అయిందంటూ
హీరోయిన్ సమంత క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సమంత, తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.ఈ సినిమా వచ్చి 15 ఏళ్లు అయింది. అంటే సమంత ఇండస్ట్రీలో 15 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో తన 15 ఏళ్ల కెరీర్ గురించి ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేసింది.
తన 15 ఏళ్ళ కెరీర్ గురించి గుర్తు చేసుకుంటూ..అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు.. మరెన్నో చేదు అనుభవాలున్నాయంటూ చెప్పుకొచ్చింది. జీవితంలో కొన్ని విషయాలు ఎంత మర్చిపోవాలన్నా మరిచిపోలేం అని.. కొన్ని మాత్రం ఇట్టే మరిచిపోతామంటూ సమంత తెలిపింది.


ముఖ్యంగా తన మాజీ భర్తతో కలిసి నటించిన ఏ మాయ చేసావే సినిమాను సమంత ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.ఏ మాయ చేసావేలో ప్రతీ సీన్ తనకు గుర్తుందని.. గేట్ దగ్గర నిలబడి కార్తిక్‌ను కలిసేది తనకు ఫస్ట్ సీన్ అన్నారు సమంత. వీరిద్దరు కలిసి నటించిన మొదటి సినిమా ఏ మాయ చేశావేలో ఈ జంట ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఈ మూవీలో చైతూ, సమంత రొమాన్స్ సీన్లు ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంటాయి.ముఖ్యంగా ట్రైన్ సీన్‌లో వీరిద్దరు లిప్ లాక్స్‌తో రెచ్చిపోయి నటించారు. అభిమానులను ఈ సీన్ ఇప్పటికీ ఆకట్టుకుంటుంది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిమధ్య ప్రేమ చిగురించడంతో ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట, 2021లో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇన్నేళ్ల కెరీర్‌లో తన జీవితంలో ఎన్నో చూసానని.. తన బలమేంటి.. బలహీనతలేంటి అర్థమైందని తెలిపారు సమంత. రాబోయే 15 ఏళ్ళ కోసం వేచి చూస్తున్నానని సమంత తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.












Click it and Unblock the Notifications