తన ఆస్తిలో 60 శాతం వారికిచ్చేస్తున్న సమంత?

ప్రస్తుతం నాగచైతన్య, సమంత, శోభితకు సంబంధించిన వార్తలే సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. శోభితతో నిశ్చితార్థం జరిగిన తర్వాత నాగచైతన్యకన్నా సమంత ఎలా స్పందిస్తుంది? దీనిపై సమంత ఏ నిర్ణయం తీసుకోబోతోంది? భవిష్యత్తులో ఏం చేయనుంది?.. తదితర విషయాలతో సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమవడం అనేది సమంత ఊహించలేని, వారిద్దరూ ఎప్పటికైనా కలిసిపోతారనే ఆశలో ఉన్న అక్కినేని అభిమానులుకూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు.

చిన్నారులతో గడిపిన తర్వాత సంతోషంగా సమంత
సినిమాకు రూ.5 నుంచి రూ.7 కోట్ల మధ్యలో పారితోషికం తీసుకునే సమంత దాదాపు ఇప్పటివరకు రూ.150 కోట్ల ఆస్తులు కూడబెట్టింది. తనకు వస్తున్న ఆదాయాన్ని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతోంది. ప్రత్యూష ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోంది. వీటిల్లో ప్రధానంగా అనాథ పిల్లల ఆశ్రమాలు నడిపిస్తున్నవారికి భూరి విరాళాలు ఇస్తోంది. తనకున్న ఆస్తిలో 60 శాతాన్ని అనాథాశ్రమాలకు రాయాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మానసికంగా కూడా ఎంతో ఆందోళన చెందుతోందని, అనాథాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులతో కొంతసేపు గడుపుతున్నతర్వాతే ఆమె సంతోషంగా ఉంటున్నారని సమంత సన్నిహితులు చెబుతున్నారు.

Samantha is going to give 60 percent of her wealth to orphans and orphanages

మరో వెబ్ సిరీస్ లో సమంత
ప్రస్తుతం సమంత వివాహం చేసుకుంటుందా? అలాగే మిగిలిపోతుందా? అంటూ అనేక రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం రాజ్ డీకే దర్శకత్వంలో మరో వెబ్ సిరీస్ చేయబోతోంది. మాఇంటి బంగారం పేరుతో తన సొంత బ్యానరులో సినిమా చేస్తోంది. తమిళంలో విజయ్ సరసన, హిందీ లో షారుక్ ఖాన్ సరసన, మళయాళంలో మమ్ముట్టి సరసన ఆఫర్లు వచ్చాయంటున్నారుకానీ వాటిపై అధికారికంగా స్పష్టత రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+