అతన్ని ఇప్పటికీ మిస్ అవుతున్నా..సమంత సంచలన పోస్ట్

హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు. సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్‌లో ఉన్నాడు. నాగ చైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు.ఈక్రమంలోనే సైలెంట్‌తో శోభితతో గురువారం నిశ్చితార్ధం చేసుకున్నాడు. అతి కొద్దిమంది సమక్షంలో వీరి నిశ్చితార్ధ కార్యక్రమం జరిగింది. మరోవైపు సమంత మాత్రం సింగిల్‌గానే ఉంటూ వస్తున్నారు. ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడుతో సమంత ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే అవి కేవలం ప్రచారానికే పరిమితం అయ్యాయి.

samantha post on bollywood hero varun dhawan

ఇదిలా ఉంటే సమంత తాజాగా సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సమంత నటించిన వెబ్‌సిరీస్ 'సిటడెల్-హనీ బన్నీ'. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించగా.. రాజ్ డీకే దర్శకత్వం వహించారు. అయితే ఈ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ వెబ్ సిరీస్ కోసం సమంత ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

samantha post on bollywood hero varun dhawan

ఈ క్రమంలోనే మేకర్స్ నవంబర్‌లో 'సిటడెల్' డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించారు. తాజాగా, దీని ప్రీమియర్‌ను లండన్‌లో ప్రదర్శించారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సమంత ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.ఈ వేడుకకు వరుణ్ ధావన్ దూరంగా ఉన్నారు. దీంతో అతన్ని మిస్ అవుతున్నట్టుగా సమంత పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు''మిస్సింగ్ మై మ్యాన్ వరుణ్ ధావన్'' అనే క్యాప్షన్ జత చేసింది సమంత. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+