గుడ్ న్యూస్ చెప్పిన సమంత..కొత్త జర్నీ స్టార్ట్ అంటూ పోస్ట్
హీరోయిన్ సమంత ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కుడ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది.అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా సమంత ఎదిగారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో సమంత నటించారు. ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఆమె వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది.
నాగ చైతన్యతో విడాకులు అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. ఆమె అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు.మయసైటీస్ వ్యాధి కారణంగా కొంతకాలం సమంత సినిమాలకు దూరంగా ఉన్నారు.మయసైటీస్నయం కావడంతో సమంత తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ముఖ్యంగా నాగచైత్యన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. ఈక్రమంలోనే బాలీవుడ్ 'సిటాడెల్ (హనీ, బన్నీ)' అనే వెబ్ సిరీస్‌లో నటించారు.ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు.

ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. హీరో వరుణ్ ధావన్‌తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో సమంత నటించారు. తన మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళను నాగ చైతన్య ప్రేమించి వివాహం చేసుకున్నాడు. సమంత మాత్రం సింగిల్‌గానే తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆ మధ్య సమంత రెండో పెళ్లిపై అనేక గాసిప్స్ తెర మీదకు వచ్చాయి. అయితే అవి కేవలం ప్రచారం వరకు మాత్రమే పరిమితం అయ్యాయి. మయసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత, ఇప్పుడిప్పుడే కోలుకుంది.దీంతో వరుస సినిమాలను లైన్లో పెడుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే అభిమానులకు సమంత గుడ్ న్యూస్ చెప్పారు.సమంత నిర్మాతగా మారబోతున్నారు. ఆమె నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై మొదటి ప్రాజెక్ట్‌గా 'శుభం' (shubam) షూటింగ్ పూర్తైనట్లు సమంత వెల్లడించింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది.
దీనిపై ఆమె స్పందిస్తూ..మా ప్రేమపూర్వక చిన్న శ్రమను మీకు అందిస్తున్నాము. పెద్ద కలలు కన్న చిన్న బృందం.ఈ ప్రయాణానికి మరియు మేము కలిసి సృష్టించిన దానికి మేము చాలా కృతజ్ఞులం.మీరు మా సినిమాను ఆస్వాదిస్తారని మేము నిజంగా ఆశిస్తున్నాము... మరియు ఇది నిజంగా ప్రత్యేకమైనదానికి నాంది కావాలని కోరుకుంటున్నాను అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. సమంత షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications