తెలుగులో ఆ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన సమంత?
తెలుగులో స్టార్ కథానాయికగా ఉన్న సమంత కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుండటంతో చికిత్స తీసుకునేందుకు విదేశాలకు వెళ్లిందుకు అంతకు ముందుగా ఏడాది సమయం సినిమాలకు దూరంగా ఉండాలని, నిర్మాతల దగ్గర నుంచి ముందుగా తీసుకున్న అడ్వాన్స్ ను కూడా తిరిగిచ్చేసింది. చికిత్స పూర్తయిన తర్వాత కొత్త కథలను వింటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం విశ్వంభర. రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి దర్శకుడు మల్లిడి వశిష్ట కాగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోంది. ఈ సినిమాలో కథానాయికగా నటించేందుకు సమంత దగ్గరకు ఆఫర్ వచ్చింది. అయితే ఆ సమయంలో సినిమాలకు దూరంగా ఉండటంతోపాటు చికిత్స తీసుకుంటుండంతో ఈ సినిమాకు నో చెప్పింది. దీంతో ఈ సినిమా కథ అందరు హీరోయిన్ల దగ్గరకు వెళ్లగా చివరగా త్రిష ఓకే చెప్పింది.

ప్రస్తుతం చిరంజీవి సినిమాకు సమంత నో చెప్పిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవానికి కొద్ది నెలల క్రితం కనుక సమంత తన రీ ఎంట్రీ గురించి ప్రకటన చేసివుంటే విశ్వంభర సినిమాలో కచ్చితంగా హీరోయిన్ అయివుండేదని అభిమానులు అంటున్నారు. గత రెండు చిత్రాలు శాకుంతలం, ఖుషీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న సమంత కథల ఎంపికలో ఆచూతూచి నిర్ణయాలు తీసుకోవడంతోపాటు సినిమా హీరో, దర్శకుడు, నిర్మాత, బడ్జెట్ తదితరవాటిని కూడా పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేసుకుంటోంది.












Click it and Unblock the Notifications