శ్రుతి హాసన్ స్థానంలో సమంత.. ఇంతకీ ఏ సినిమానో తెలుసా..?
నటి సమంత పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. నాగచైతన్య, సమంత ప్రేమ పెళ్లి, ఆ తర్వాత విడాకులతో సామ్ చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. విడాకుల తర్వాత ఆమె సెకండ్ ఇన్సింగ్స్‌ను మొదలుపెట్టి పలు ప్రాజెక్టులతో బిజిగా ఉన్నారు. ప్రస్తుతం సామ్ ముంబాయిల్‌నే మకాం వేసి బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలపైనే కాన్సట్రేషన్ చేస్తున్నారు. అయితే, ఇప్పడు సమంత గురించి ఓ వార్త సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే, ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులో సామ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే, ఈ ప్రాజెక్టులో ముందుగా శ్రుతిహాసన్‌ను తీసుకున్నారట. కానీ, కొన్ని కారణాల వల్ల ఆమె ఆ స్థానం నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. ఇప్పడు అదే ప్లేస్‌లో సామ్‌ను తీసుకున్నట్లు సమాచారం.
శ్రుతి హాసన్ ఇటీవలే 'బాఫ్టా' విజేత ఫిలిప్ జాన్ దర్శకత్వంలో వస్తున్న ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ 'చెన్నై స్టోరీస్‌లో నటిస్తోన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా తాజాగా మొదలైంది. అయితే ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి శ్రుతి హాసన్ తప్పుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఇందుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, ఈ ప్రాజెక్ట్ కోసం స్టార్ హీరోయిన్ సమంతను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకే ప్రాధాన్యమిస్తున్న సామ్, ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పే అవకాశాలు ఉన్నట్లు బీ టౌన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సౌత్ మూవీలతో బిజిగా ఉన్న శ్రుతీ..
చెన్నై స్టోరీస్ రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న చిత్రం. ఈ సినిమాలో వివేక్ కల్రా, నిమ్మి హరస్గమా, సహానా వాసుదేవన్‌లు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. రిప్పల్ వరల్డ్ పిక్చర్స్ మరియు Ie Ie ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. హీరోయిన్ శ్రుతి హాసన్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజిగా ఉన్నారు. గత సంవత్సరం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ పార్ట్ 1సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక, ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో సలార్ పార్ట్ 2తో పాటు పలు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, అడవి శేష్‌తో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications