ఆ హీరోతో నటించడానికి సమంతకు ఆఫర్... ఒప్పుకుంటుందా?
సమంత నాగచైతన్యకు విడాకులిచ్చి రాజ్ నిడుమోరును పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం ముంబయిలో స్థిరపడింది. హైదరాబాద్ మాత్రం అప్పుడప్పుడు వచ్చిపోతోంది. సినిమాలు కూడా చేయడంలేదు. వెబ్ సిరీస్ లు చేస్తోంది. తాజాగా సమంతకు ఓ తమిళ చిత్రం నుంచి మంచి ఆఫర్ వచ్చింది. ఆమెతో నిర్మాత, దర్శకుడు సంప్రదింపులు జరుపుతున్నారు. తమిళంలో సంచలన కథానాయకుడైన శింబు హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ అనే సినిమా చేస్తున్నారు. కలైపులి థాను దీనికి నిర్మాత. ఈ సినిమాలో నటించేందుకే సమంతను అడిగారు. అయితే ఇంకా ఆమె ఎటువంటి సమాధానం చెప్పలేదు.
సినిమాలు తగ్గినా నెంబర్ వన్ గా..
నాగచైతన్యకు విడాకులిచ్చిన తర్వాత, అతను పెళ్లి చేసుకునేంతవరకు వేచి చూసి, ఆ తర్వాత తాను చేసుకుంది. ఈలోగా నాగచైతన్యపై పరోక్షంగా కామెంట్లు చేసింది. కానీ ఎవరూ సమంతకు మద్దతుగా నిలవలేదు. మయోసైటిస్ తో చికిత్స తీసుకునేందుకు సినిమాలకు విరామం ప్రకటించిన తర్వాత నటిద్దామనుకున్నప్పటికీ మన హీరోలెవరూ ఆమెతో నటించడానికి మొగ్గుచూపలేదు. దీంతో వెబ్ సిరీస్ లు రెండు ఒప్పుకుంది. సినిమాలు తగ్గిపోయాయి. అయినప్పటికీ ఇండియాలో ఇప్పటికీ నెంబర్ వన్ హీరోయిన్ గా సమంత ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఉత్తర చెన్నైలో జరిగిన వాస్తవ కథతో..
శింబుతో వెట్రిమారన్ చేస్తున్న సినిమా ఉత్తర చైన్నైలో జరిగిన ఓ యధార్థ గాథ. శింబు యువకుడిగా, మధ్య వయస్కుడిగా రెండు పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఓ పాత్ర కోసం సమంతను అడిగారు. ఆమె ఓకే చెప్పాల్సి ఉంది. వెట్రిమారన్, శింబు కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా ఇది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. తమిళంలో సమంత గతంలో చాలా సినిమాలు చేసింది. విజయ్, విశాల్, సూర్య, విజయ్ సేతుపతి లాంటివారితో నటించింది. తమిళ సినిమాల్లో నటించి చాలాకాలం కావడంతో ఒప్పుకుంటుందేమో చూడాలి. శింబు సినిమాలో విజయ్ సేతుపతి కూడా ఒక ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. దీంతో ఇది మల్టీస్టారర్ సినిమాలా మారింది.












Click it and Unblock the Notifications