డాక్టర్‌తో పరీక్ష చేయిస్తా: సమంత
రెండున్నర సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ ఇప్పటికీ దేశంలో నెంబర్ వన్ హీరోయిన్ గా అందాల ముద్దుగుమ్మ సమంత చెలామణి అవుతోంది. మయోసైటిస్ చికిత్స తీసుకున్న తర్వాత కేవలం వెబ్ సిరీస్ లపై దృష్టిసారించింది. సినిమాలకు ఇచ్చే పారితోషికమే వెబ్ సిరీస్ లకు కూడా ఇస్తున్నారు. రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడంవల్ల సినిమాల్లో అవకాశాలు రావడంలేదని బహిరంగంగానే సమంత చెప్పింది. అయితే తాజాగా అల్లు అర్జున్ - అట్లీ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో ఒక హీరోయిన్ గా సమంత ఎంపికైందంటూ వార్తలు వస్తున్నాయి.
15 బ్రాండ్స్ వదులుకున్నను
తాజాగా సమంత తనను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న అభిమానులందరికీ క్షమాపణలు చెప్పింది. ఒకప్పుడు తాను కేవలం బ్రాండ్స్ పూర్వాపరాలు తెలుసుకోకుండా ప్రమోషన్స్ చేసేదాన్ని, ఇకనుంచి మాత్రం అలా చేయను అని చెప్పింది. ఏది పడితే దాన్ని ప్రమోట్ చేయడంలేదని, ఈ సంవత్సరం 15 బ్రాండ్స్ వదులుకున్నట్లు వెల్లడించింది. బ్రాండ్స్ ను ఎంపిక చేసుకునే విషయంలో ఇకనుంచి ఎంతో బాధ్యతాయుతంగా ఉంటానని, తనవద్దకు ఎన్నో వస్తుంటాయని, వాటిని వైద్యులతో పరీక్షలు చేయించి వారు ఓకే చెప్పిన తర్వాతే ప్రమోట్ చేస్తానని స్పష్టం చేసింది.

లక్షల సంఖ్యలో ఉన్న అభిమానుల కోసం
ఇప్పటికీ సమంతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లక్షల సంఖ్యలో ఉన్న అభిమానుల కోసం ఆమె ఏ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తే దాన్నే వాడుతున్నారు. అయితే కొన్ని బ్రాండ్స్ పై ఫిర్యాదులు రావడంతో ఇకనుంచి ఇలా చేయకూడదని నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీమాన్2, హనీబన్నీ తర్వాత రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ చేయబోతోంది.
అలాగే తెలుగులో మాఇంటి బంగారం పేరుతో సొంత బ్యానరుపై తీస్తున్న సినిమాలో నటిస్తోంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తన మనస్తత్వంలో మార్పు వచ్చిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జీవితాన్ని పాజిటివ్ గా ఉండేలా చూసుకుంటోంది. మహిళల సాధికారత, మహిళల స్వయం ఉపాధి తదితర విషయాలపై ఎక్కువగా మాట్లాడుతోంది. మహిళలకు జీవితంలో ఎలా ఎదగాలనే విషయాన్ని చాలా వేదికపై బోధిస్తోంది.












Click it and Unblock the Notifications