నాగచైతన్యతో విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత
దక్షిణాది బ్యూటీ సమంత నటించిన వెబ్ సిరీస్ హనీబన్నీ అమెజాన్ ప్రైమ్ లో ఈనెల ఏడోతేదీ నుంచి ప్రసారమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో మిక్స్ డ్ టాక్, మరికొన్ని ప్రాంతాల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ కు ఇది రీమేక్. దీంతోపాటు మా ఇంటి బంగారం పేరుతో సొంత బ్యానరులో నిర్మిస్తున్న సినిమాలో నటిస్తోంది. హనీబన్నీకి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కోసం పలు ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే విడాకులు తీసుకున్న తర్వాత మహిళలపట్ల సమాజం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టింది. కష్టకాలంలో తనకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఎంతో అండగా నిలబడ్డారని వ్యాఖ్యానించింది.
పెళ్లి గౌను రీమోడల్ చేయించడం ప్రతీకారం కాదు
నాగచైతన్యతో పెళ్లి జరిగిన సమయంలో వేసుకున్న గౌనును సమంత రీమోడల్ చేయించింది. దీనిపై ఆమె మాట్లాడుతూ ఇది ప్రతీకారం తీర్చుకోవడం కాదని, దాన్ని రీమోడల్ చేయాలనుకున్నప్పుడు ఎంతో బాధపడ్డానని, తన జీవితంలో జరిగిన ప్రతి విషయాలను తాను ఎప్పుడూ దాచాలనుకోలేదని సమంత చెప్పింది. ప్రస్తుతం తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా అనేక దశలను దాటుకుంటూ వచ్చానని, అందుకు ఆత్మవిశ్వాసమే కారణమని, అది తన బలమని, కష్టాలు వచ్చినంత మాత్రాన జీవితం అంతటితో ముగిసిపోయినట్లు కాదన్నారు. ఎక్కడైతే ముగుస్తుందో అక్కడే కొత్త జీవితం ప్రారంభమవుతుందని చెప్పింది.

హనీబన్నీకి వారిద్దరి పేర్లు సూచించాను
హనీబన్నీ సిరీస్ మొదట తాను ఒప్పుకోలేదని, అందులో యాక్షన్ సన్నివేశాలున్నాయని, కృతిసనన్, కియారా అడ్వానీ పేర్లు సూచించానని చెప్పింది. మయోసైటిస్ కోసం చికిత్స తీసుకుంటుండటంతో యాక్షన్ సన్నివేశాలు చేయలేనని, వారిద్దరైతే ఆ పాత్రకు న్యాయం చేయగలుగతారని చెప్పినట్లు ఇంటర్వ్యూలో సమంత వెల్లడించింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తీవ్రమైన ట్రోలింగ్ కు గురైంది. భార్యాభర్తల మధ్య బంధం విచ్ఛిన్నమైతే అందరూ అమ్మాయినే నిందిస్తారని, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష తగ్గలేదని, దరదృష్టవశాత్తూ మనందరం అటువంటి సమాజంలో జీవిస్తున్నామంటూ వ్యాఖ్యానించింది. తనపై కూడా ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారని, తన సన్నిహితులు ఎంతో ధైర్యం చెప్పి తనను ముందుకు నడిపించారని సమంత వెల్లడించింది.












Click it and Unblock the Notifications