సమంత సీమంతం ఫంక్షన్ చూశారా..? సంప్రదాయ పద్దతిలో.. ఫొటోలు వైరల్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సీమంతం ఫంక్షన్ ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల మధ్య కోయంబత్తూరులోని ఈషా ఆశ్రమంలో సీమంతం వేడుకలు నిర్వహించారు. శ్రీవిద్య సంప్రదాయంలోని శ్రీకల్పం(కాలా ఆవరణ) పద్ధతిలో సమంత సీమంతం కార్యక్రమం జరిగింది. పండితుల మంత్రోచ్ఛారణ మధ్య సమంతకు భర్త రాజ్ నిడిమోరు, బంధువులు మంగళ స్నానం నిర్వహించారు. ఈ సంప్రదాయంలో కాబోయే తల్లిని సాక్షాత్తు దేవతగా పరిగణిస్తారని.. ఈ కార్యక్రమం జరుపుకోవడం తనకు, బిడ్డకు ఎంతో అదృష్టంగా భావిస్తానని సమంత తన సోషల్ మీడియా ఖాతా అయిన ఇన్ స్టా గ్రామ్ లో పేర్కొన్నారు. ఈ మేరకు సీమంతం ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న సమంత.. గత ఏడాది దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె తాను గర్భవతి అని అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె సీమంతం వేడుక కొద్దిమంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఇటీవల 'మా ఇంటి బంగారం' సినిమాతో సమంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 100 కోట్లకుపైగా గ్రాస్ ను రాబట్టి సమంత సత్తా ఏంటో నిరూపించింది. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే సమంత ప్రెగ్నెంట్ అయ్యారు. అయినా కూడా ఎలాంటి రెస్ట్ తీసుకోకుండా ఆమె సినిమా కోసం కష్టపడ్డారు.

'మా ఇంటి బంగారం' సినిమాకు సమంత భర్త రాజ్ నిడిమోరు కథను అందించారు. అలాగే నిర్మాతగానూ వ్యవహరించారు. ఇక నందినిరెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ట్రాలాల పిక్చర్స్ పతాకంపై ఈ మూవీ రూపొందింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కు, ముఖ్యంగా మహిళలకు బాగా కనెక్ట్ అయింది. అందుకే కలెక్షన్ల పరంగా మూవీ దుమ్మురేపింది. ఈ క్రమంలో సమంత కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ మూవీ నిలిచింది. అయితే అభిమానుల కోరిక మేరకు ఈ మూవీకి పార్ట్ 2 కూడా తీస్తామని సక్సెస్ మీట్ లో దర్శకుడు రాజ్ నిడిమోరు చెప్పారు.












Click it and Unblock the Notifications
