తప్పు చేశా , జీవితంలో చాలా కోల్పోయాను : సమంత
సినిమాలకు దూరంగా ఉన్న సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తరువాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.
ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత సినిమాల్లో నటించడం ఆపేసింది. ప్రస్తుతం సమంత చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. సినిమాలకు దూరంగా ఉన్న సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది. సోషల్ మీడియాలో సమంతకు ఎన్నలేని అభిమానులు ఉన్నారు. సమంతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

33 మిలియన్ల అభిమానులు సమంతను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారంటే అమ్మడు రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సమంత తన సోషల్ మీడియా ద్వారా ఫుడ్‌కు సంబంధించిన ఆరోగ్య చిట్కాలను సైతం అందిస్తుంటుంది. తాజాగా సమంత తన ఫాలోవర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. యంగ్ స్టార్స్ అజేయులని అనుకోవద్దని విజ్నప్తి చేసింది.
దానికి నేను కూడా అతీతం కాదని సమంత చెప్పుకొచ్చింది. 20 ఏళ్ల వయస్సున్నప్పుడు నా కెరీర్ ప్రారంభించానని, అప్పుడు మన చేతిలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఎన్నో బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించానని సమంత తెలిపింది. అయితే కొన్ని బ్రాండ్స్ ఎందుకు చేశానా అని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, సరైన మార్గాన్ని అనుసరించాలని నాకు నేను అనుకున్నాను. అర్థం లేని పనులు చేసినందుకు ఇప్పుడున్న సమంతకు, పాత సమంతకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని ఆమె వాపోయింది.
నేను గత ఏడాది 15 బ్రాండ్స్ ను వదలుకున్నా. కోట్ల డబ్బులు కూడా వదులుకున్నా. ఇప్పుడు ఎండార్స్ మెంట్ వచ్చిన ప్రతిసారీ నేను దానిని అంగీకరించే ముందు ముగ్గురు వైద్యులతో ఆ బ్రాండ్స్‌ను చెక్ చేస్తాని అని సమంత తెలిపారు.అందుకే యంగ్ ఏజ్‌లో చేసే పనులు అన్నీ కూడా సరైనవే అనుకోవడం తప్పని తన ఫాలోవర్లకు సమంత హితబోద చేసింది. ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే..విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తర్వాత సమంత మరో తెలుగు సినిమాలో నటించలేదు.
'సిటాడెల్' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో మాత్రం సమంత నటించారు. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ వెబ్ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇదే సమయంలో సమంత చాలాకాలం తర్వాత తన తెలుగు సినిమాను ఎనౌన్స్ చేశారు.'మా ఇంటి బంగారం' సినిమాతో సమంత తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతుంది.ఈ సినిమాకు సమంతనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.సమంత తెలుగులో రీఎంట్రీ ఇవ్వనుండటంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.












Click it and Unblock the Notifications