సమంతను ఘోరంగా అవమానించిన అక్కినేని ఫ్యామిలీ..?
హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.
అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే వీరిద్దరు ఇక కలవరని భావించిన నాగార్జున ఫ్యామిలీ సమంత జ్ఞాపకాలు లేకుండా చేశారని తెలుస్తోంది. ఇన్నాళ్లు వీరు కలుస్తారని అక్కినేని ఫ్యామిలీకి ఎక్కడో ఒక చిన్న ఆశ ఉండేదట. ఆ ఆశతోనే సమంతకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు వారి ఇంట్లో అలానే దాచుకున్నారట. ఇక మీదట వీరిద్దరూ కలవరని తెలుసుకొని అక్కినేని ఇంట్లో సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలను వారి స్టోర్ రూమ్ నుంచి తీసేశారని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక విడాకులు అనంతరం నాగ చైతన్య చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. నాగ చైతన్య ప్రస్తుతం తాండేల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు నాగ చైతన్య గ్రీన్ సీగ్నల్ ఇచ్చాడు. విరూపాక్ష సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయిన కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక సినిమాకి చేయడానికి నాగ చైతన్య రెడీ అయ్యాడు. విరూపాక్ష మాదిరిగానే ఈ సినిమా కూడా హారర్ జోనర్‌లో తెరకెక్కబోతుంది. సమంత సైతం బాలీవుడ్ వెబ్ సిరీస్‌తో పాటు, తమిళంలో విజయ్ సినిమాలో నటిస్తోంది.












Click it and Unblock the Notifications