ఐటీ హబ్ లో కేసు పెట్టిన నటి, నేను బెంగళూరులో ఉన్నానా ?, పాకిస్థాన్ లో ఉన్నానా ?, దాడి !
కన్నడ మాట్లాడినందుకే తమపై దాడి జరిగిందని శ్యాండిల్ వుడ్ నటి హర్షిక పూనాచా అలియాస్ హర్షిక దంపతులు బెంగళూరు నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. తమపై దాడికి పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని అదనపు పోలీస్ కమిషనర్ (ఈస్ట్) రమణ్ గుప్తాను కలిసిన హర్షిక, ఆమె భర్త భువన్ మనవి చేశారు.
మా ఫిర్యాదుపై అదనపు కమిషనర్ స్పందించారని నటి హర్షిక తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అడిషనల్ పోలీసు కమీషనర్ రమణ్ గుప్తా తమకు హామీ ఇచ్చారని నటి హర్షిక తెలిపారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద్ ను తాము కలవకపోవడంతో తరువాత తాము అదనపు పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు నటి హర్షిక, కన్నడ నటుడు భువన్ తెలిపారు. ఘటన జరిగిన రోజున ఫిర్యాదు చేస్తే ఘటన మరో రూపం దాల్చే అవకాశం ఉన్నందున ఆ రోజు ఫిర్యాదు చేయలేదని హర్షిక, భవన్ వివరించారు.

దీనికి సంబంధించి బంధువులు, శ్రేయోభిలాషుల సలహా మేరకు నటి హర్షిక సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తరువాత పెద్దల సలహాతో బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నటి హర్షిక తెలిపారు.నా చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నానని, అయితే ఫిర్యాదు వెనుక ఎలాంటి రాజకీయ అజెండా లేదని, ఫిర్యాదు చెయ్యాలని ఎవ్వరూ తమకు చెప్పలేదని, మా సన్నిహితుల సూచన మేరకు తాము కేసు పెట్టామని నటి హర్షిక తెలిపారు.
బెంగళూరులో పుట్టి పెరిగిన తనకు కన్నడ మాట్లాడితే ఇలాగుంటుందని చేదుఅనుభవం ఎదురుకావడంతో తాను కర్ణాటకలో ఉన్నానా, లేదంటే పాకిస్థాన్‌లో ఉన్నానా అని ఫీలింగ్ వచ్చిందని నటి హర్షిక, ఆమె భర్త భువన్ విచారం వ్యక్తం చేశారు. అయితే బెంగళూరులో శాంతిభద్రతల పరిస్థితిని తాను తప్పు పట్టడం లేదని శ్యాండిల్ వుడ్ నటి హర్షిక స్పష్టం చేసింది. ఇటీవల బెంగళూరులోని ఓ వర్గం వాళ్లు ఎక్కువగా నివాసం ఉంటున్న ఏరియాలో భోజనం చెయ్యడానికి కుటుంబ సభ్యులతో వెళ్లిన సమయంలో మాపట్ల కొందరు దురుసుగా ప్రవర్తించారని నటి హర్షిక, ఆమె భర్త భువన్ ఆరోపించారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications